Health Tips: కాఫీ ఎక్కువగా తాగితే హానికరమే.. రోజులో ఎన్ని కప్పులు మించకూడదో తెలుసా..!
Health Tips: చాలామంది కాఫీ తాగడానికి ఇష్టపడతారు. 1 కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగిన తర్వాత శరీరం చురుకుగా పనిచేస్తుంది. చాలా మంది వ్యక్తులు 1 కప్పు స్ట్రాంగ్ కాఫీతో రోజుని ప్రారంభించాలని
Health Tips: చాలామంది కాఫీ తాగడానికి ఇష్టపడతారు. 1 కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగిన తర్వాత శరీరం చురుకుగా పనిచేస్తుంది. చాలా మంది వ్యక్తులు 1 కప్పు స్ట్రాంగ్ కాఫీతో రోజుని ప్రారంభించాలని ఇష్టపడతారు. కొందరు రోజులో ఎప్పుడైనా కాఫీ తాగుతారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కాఫీకి చాలా డిమాండ్ ఉంది. కొన్ని నివేదికల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఆసియా అంతటా కాఫీకి డిమాండ్ పెరుగుతుందని అంచనా. కాఫీకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా కొంతకాలం క్రితం 3 పరిశోధనలు జరిగాయి. కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, వయసు కూడా పెరుగుతుందని ఈ పరిశోధనల్లో తేలింది. అయితే దీని కోసం ఎన్ని కప్పుల కాఫీ తాగాలో తెలుసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
హాంకాంగ్‌లోని మటిల్డా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు చెందిన డైటీషియన్ కరెన్ చోంగ్ ప్రకారం.. ‘కాఫీ ప్రియులు దానిని ఎక్కువగా తీసుకోకూడదు. దీనిపై మరింత పరిశోధన అవసరం. రోజులో రెండు మూడు కప్పుల కాఫీ తాగితే పర్వాలేదు. మూడు కప్పుల కాఫీలో దాదాపు 200 మి.గ్రా కెఫీన్ ఉంటుందని గుర్తుంచుకోండి’ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ కంటే ఎక్కువ తీసుకోకూడదని సూచిస్తోంది. ఇది దాదాపు నాలుగు నుంచి ఐదు కప్పుల కాఫీకి సమానం అని కరెన్ చోంగ్ చెబుతున్నారు.
‘కెఫీన్ హృదయ స్పందన రేటును పెంచడానికి కారణమవుతుంది. కెఫిన్ నాడీ, హృదయనాళ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి నేను పిల్లలకు, పెద్దలకు కాఫీ తాగమని సూచించను. గర్భిణి అయినా పాలిచ్చే తల్లి అయినా రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకూడదు’ మీరు అల్సర్‌తో బాధపడుతున్నట్లయితే కాఫీ తాగకూడదు. కెఫిన్ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి చేయడానికి కడుపుని ప్రేరేపిస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండటం మంచిది. కాఫీ ఎముకల ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని పరిశోధనలలో కాఫీని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గుతుందని తేలింది.
అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.