Sonia Gandi: “పార్టీ వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరిగింది.. ఇప్పుడు ఆ రుణం తిరిగి చెల్లించే సమయం వచ్చింది”
ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఉదయ్‌పూర్(Udaypur)లో చింతన్ శిబిర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ హోదాలు, పదవులు చేపట్టిన వారు ...
ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఉదయ్‌పూర్(Udaypur)లో చింతన్ శిబిర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ హోదాలు, పదవులు చేపట్టిన వారు దాదాపు 400 మంది పాల్గొంటారని తెలిపారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత, సంస్థాగత సమస్యలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ వేగవంతమైన పునరుజ్జీవనానికి ఐక్యత, సంకల్పం, నిబద్ధత వంటివి ముఖ్య వనురులని అని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, స్థిరమైన సామూహిక ప్రయోజనం మాత్రమే ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుందన్నారు. పార్టీ వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరిగిందన్న సోనియా.. ఇప్పుడు ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించే సమయం వచ్చిందని అన్నారు. పార్టీ గురించి, తాము చేస్తున్న పనుల గురించి ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరమన్న కాంగ్రెస్ అధినేత్రి.. ఆత్మవిశ్వాసం క్షీణించి వినాశకరమైన వాతావరణం ఏర్పడేలా వ్యవహరించకూడదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
చింతన్ శివిర్ అనేది ఒక ఆచారంగా మారకూడదు. మనం ఎదుర్కొనే అనేక సైద్ధాంతిక, ఎన్నికల, నిర్వాహక సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది పునర్నిర్మించబడాలి. ప్రతి ఆరు గ్రూపులకు విస్తృత ఎజెండాను రూపొందించడానికి ప్యానెల్‌లను ఏర్పాటు అయ్యాయి. మీ ఆమోదం కోసం మా పార్టీ రాజ్యాంగంలో సవరణ కూడా ఉంది. ఇది డిజిటల్ మెంబర్‌షిప్‌తో సంబంధం కలిగి ఉంది. మీరందరూ స్వాగతిస్తారని, మద్దతు ఇస్తారని నేను కచ్చితంగా భావిస్తున్నాను.
– సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీచదవండి