Food Inflation: ముదురుతున్న ఉక్రెయిన్ సంక్షోభం.. పెరుగుతోన్న గోధుమల ధర.. పేద దేశాల పరిస్థితి ఏంటి..
ఒక నివేదిక ప్రకారం ప్రతి రాత్రి 690 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో పడుకుంటున్నారు. మధ్య, తక్కువ-ఆదాయ దేశాలలో పేదల జీవనోపాధిని నాశనం చేసిన COVID-19 మహమ్మారి అకలి కేకలను మరింత పెంచింది...
ఒక నివేదిక ప్రకారం ప్రతి రాత్రి 690 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో పడుకుంటున్నారు. మధ్య, తక్కువ-ఆదాయ దేశాలలో పేదల జీవనోపాధిని నాశనం చేసిన COVID-19 మహమ్మారి అకలి కేకలను మరింత పెంచింది. ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభం ఆహార కొరతను సృష్టించే అవకాశం ఉంది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల అభివృద్ధి చెందుతున్న దేశాలను ఎక్కువగా ప్రభావితం చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా పేద, మధ్యతరగతి వర్గాలను తీవ్రంగా దెబ్బతీసింది. భారతదేశానికి పక్కనే ఉన్న శ్రీలంక, పాకిస్తాన్‌లలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫ్రికాలో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది.
ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం
దాదాపు ఒకటిన్నర దశాబ్దంలో ప్రపంచం చూసిన మూడో ఆహార ద్రవ్యోల్బణ సంక్షోభం ఇది. 2008లో ఎల్‌నినో ప్రభావాలు, ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ ఉత్పత్తికి వ్యవసాయ భూముల్లో చెరకు ఎక్కువగా వేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు దారుణమైన స్థాయికి చేరుకున్నాయి. అనుకూల వాతావరణ పరిస్థితులు, ప్రపంచ మాంద్యం కారణంగా డిమాండ్ తగ్గడంతో పరిస్థితి మారింది. 2011 ఆహార సంక్షోభం ప్రధానంగా ఉక్రెయిన్, రష్యాలో సుదీర్ఘ కరువును సృష్టించింది. అయితే ప్రస్తుత ఆహార సంక్షోభం పూర్తిగా మానవ తప్పిదమే. శ్రీలంకలో, మహమ్మారి ప్రభావాలు దాదాపు రెండు సంవత్సరాల పాటు పర్యాటకుల రాకపోకలకు ముగింపు పలికాయి. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసింది. రాజపక్స వంశం నేతృత్వంలోని దాదాపు విచ్ఛిన్నమైన ప్రభుత్వం రసాయన ఎరువుల దిగుమతులను నిలిపివేయడం, సేంద్రీయ వ్యవసాయం చేయాలని ఆదేశించడంతో పరిస్థితి దిగజారింది. ఇది ఆహార ఉత్పత్తిని సగానికి తగ్గించింది.
మరో దేశం పాకిస్తాన్‌లో పరిస్థితి అంతదా చేయిదాటకపోయినా ఆ దేశంలో ఇటీవలి రాజకీయ సంక్షోభం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అఫ్ఘానిస్థాన్‌లోనూ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కోటి మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అనేక దేశాలను వెంటాడుతున్న పాక్షిక ఆకలి వల్ల ఒక తరం పిల్లల ఎదుగుదల కుంటుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆఫ్రికాలో పరిస్థితి ఆసియా దేశాల కంటే భయంకరంగా ఉంది. UNICEF ప్రకారం 90 శాతం మంది ఆఫ్రికన్ పిల్లలు వయస్సకు తగినట్లుగా లేరు. 60 శాతం మంది కనీస భోజనం చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా, ఆకలి కారణంగా ప్రతి మూడు సెకన్లకు ఒక పిల్లవాడు మరణిస్తున్నాడు. తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో పిల్లల పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాలు 45 శాతంగా ఉన్నాయి. ఆఫ్రికాలో జరిగే పిల్లల మరణాలలో మూడింట ఒక వంతు సూక్ష్మపోషకాల లోపానికి కారణమని చెప్పవచ్చు.
రష్యా-ఉక్రెయిన్ వివాదం
ఉక్రెయిన్, రష్యాలు గోధుమలను ఎగుమతి చేసే రెండు ప్రధాన దేశాలలో ఉన్నాయి. ప్రపంచ గోధుమ వ్యాపారంలో రష్యా వాటా 18 శాతం కాగా, ప్రపంచ ఆహార ధాన్యంలో 10 శాతం ఉక్రెయిన్ సరఫరా చేస్తుంది. ఈజిప్టు వంటి దాదాపు 25 దేశాలు తమ గోధుమలలో సగానికి పైగా రష్యా, ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. సరఫరాలో అంతరాయం కారణంగా, గోధుమ ధరలు ఇప్పటికే 42 శాతం పెరిగాయి. ఇవి 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. చాలా వరకు దిగుమతి చేసుకుంటున్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీలో ఉన్నందున, ఫలితంగా ధరల పెరుగుదల పేదలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఐరోపాయేతర దేశాలకు రష్యా, ఉక్రెయన్ యుద్ధానికి దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ప్రపంచంలో ప్రతి అంతరాయం ప్రభావితం చేస్తుంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రపంచ చమురు, గ్యాస్, బొగ్గు వాణిజ్యానికి కూడా అంతరాయం కలిగించింది. చమురు ప్రధాన ఎగుమతిదారులలో ఒకటైన రష్యాపై ఆంక్షలతో శిలాజ ఇంధనాల ధరలలో పెరుగుతున్న ప్రతి కదలిక భారతదేశంతోపాటు చాలా LDCల వంటి నికర దిగుమతి దేశాలలో ఆహార ద్రవ్యోల్బణాన్ని పైకి నెట్టివేస్తుంది.
ఎరువుల కొరత
ఈ సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తి కూడా తీవ్ర ప్రమాదంలో పడింది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల ఎగుమతిదారు, రష్యాపై ఆంక్షల నుంచి ఎరువులు మినహాయించనప్పటికీ, వివాదం ఫలితంగా సరఫరా గొలుసుల అంతరాయం ఎరువుల కొరతను సృష్టిస్తుంది. ఆర్లింగ్టన్, వర్జీనియాకు చెందిన ది ఫెర్టిలైజర్ ఇన్‌స్టిట్యూట్ డేటా ప్రకారం, రష్యా 23 శాతం అమ్మోనియా, 14 శాతం యూరియా, 10 శాతం ప్రాసెస్డ్ ఫాస్ఫేట్, 21 శాతం పొటాష్ ఎగుమతి చేస్తుంది. రష్యా నుంచి ప్రధానంగా బ్రెజిల్ (21 శాతం), చైనా (10 శాతం), అమెరికా (9 శాతం), భారత్ (4 శాతం) ఎరువులు కొనుగోలు చేస్తుంది. అంతేకాకుండా వివాదంలో రష్యా యొక్క మిత్రదేశమైన బెలారస్, పొటాష్ ప్రధాన ఎగుమతిదారు. 2020లో, భారతదేశం యురేషియా దేశం నుంచి $290 మిలియన్ల విలువైన పొటాసిక్ ఎరువులను కొనుగోలు చేసింది.
రుతుపవనాల సూచనతో 2021-22 రెండవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 316 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అంచనా వేశారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిని తాకే అవకాశం ఉంది. భారతదేశం నుంచి గోధుమలు అవసరమైన దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కానీ గోధుమ ఉత్పత్తి 1050 LMTగా అంచనా వేశారు. ఇది మునుపటి అంచనా 1113 LMT కంటే తక్కువగా ఉంది. ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వాలు పంజాబ్‌లో సేకరణ లక్ష్యాన్ని కోల్పోయాయి. యూపీ లేదా హర్యానాలో పరిస్థితి భిన్నంగా ఏం లేదు.
Read Also.. Rupee Vs Dollar: భారీగా పతనమైన రూపాయి విలువ.. డాలర్‌తో 77.31 పడిపోయిన భారతీయ కరెన్సీ..