Joe biden: అమెరికా అధ్యక్షుడి డేటింగ్ సలహా.. 30 ఏళ్ల వరకు ఆ పని వద్దొంటూ బాలికకు సూచన..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన ఓ వ్యాఖ్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ బాలికకు డేటింగ్ విషయంలో అధ్యక్షుడు ఇచ్చిన సలహాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జో బైడెన్‌ తాజాగా కాలిఫోర్నియాలోని ఇర్విన్‌ వ్యాలీ కమ్యూనిటీ..

Joe biden: అమెరికా అధ్యక్షుడి డేటింగ్ సలహా.. 30 ఏళ్ల వరకు ఆ పని వద్దొంటూ బాలికకు సూచన..
Joe Biden Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 17, 2022 | 6:40 AM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన ఓ వ్యాఖ్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ బాలికకు డేటింగ్ విషయంలో అధ్యక్షుడు ఇచ్చిన సలహాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జో బైడెన్‌ తాజాగా కాలిఫోర్నియాలోని ఇర్విన్‌ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బైడెన్‌తో కొందరు విద్యార్థులు సరదాగా ఫొటోలు తీసుకున్నారు. ఇదే సమయంలో తన ముందు నిల్చున్న ఓ బాలికతో బైడెన్‌ మాట్లాడుతూ డేటింగ్ విషయాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్భంగా జో బైడెన్‌ మాట్లాడుతూ.. ‘నేను కూతుళ్లకు, మనవరాళ్లకు ఇదే సలహా ఇచ్చాను. నీకు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎవరితోనూ సీరియస్‌ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లొద్దు’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కాస్త అసౌకర్యానికి గురైన ఆ బాలిక బదులిస్తూ.. ‘ఓకే ఈ విషయాన్ని నేను మనసులో ఉంచుకుంటాను’ అంటూ సమాదానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉండి బైడెన్‌ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడబ్బా అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా. మరికొందరు మాత్రం తన మనవరాలికి సలహా ఇస్తున్నట్లే ఇలా చెప్పుడొచ్చని స్పందిస్తున్నారు. అక్టోబర్‌ 15న పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్‌ వస్తున్నాయి. ఇప్పుడీ వీడియో తెగ ట్రెండ్‌ అవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..