చావులంటే ఇంట్రెస్ట్.. అంత్యక్రియలకు వెళ్లడం హ్యాబిట్.. పూర్తి వివరాలు తెలిస్తే భయంతో వణికిపోవాల్సిందే..

ఒక్కోకరికి ఒక్కో రకమైన వ్యాపకం, కోరికలు ఉంటాయి. కొందరికి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లాలనుంటే మరి కొందరికి మాత్రం నచ్చిన ఫుడ్ తినాలని, పుస్తకాలు చదవుడం ఇలా ఎవరి హాబీస్ వారివి. ప్రతి ఒక్కరికి ఏదో..

చావులంటే ఇంట్రెస్ట్.. అంత్యక్రియలకు వెళ్లడం హ్యాబిట్.. పూర్తి వివరాలు తెలిస్తే భయంతో వణికిపోవాల్సిందే..
Interest On Funerals
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 17, 2022 | 8:05 AM

ఒక్కోకరికి ఒక్కో రకమైన వ్యాపకం, కోరికలు ఉంటాయి. కొందరికి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లాలనుంటే మరి కొందరికి మాత్రం నచ్చిన ఫుడ్ తినాలని, పుస్తకాలు చదవుడం ఇలా ఎవరి హాబీస్ వారివి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంపై ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం విచిత్రమైన హాబీ ఉంది. ఆమెకు చావులు, అంత్యక్రియలు అంటే చాలా ఇష్టమట. ఎక్కడ అంత్యక్రియలు జరిగినా.. అక్కడికి వెళ్లేందుకు తాను ప్రయత్నిస్తుంటానంటూ ఆమె చెబుతున్న మాటలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అయితే ఆ మహిళ ఇప్పటి వరకు 200 కు పైగా అంత్యక్రియలకు హాజరవడం గమనార్హం. సమాధులను చూస్తే తనకు ఆర్ట్‌ గ్యాలరీల్లా కనిపిస్తాయని ఆమె చెబుతుంటే గుండెలో రైళ్లు పరిగెట్టాల్సిందే. లండన్‌లోని ఇస్లింగ్టన్‌ ప్రాంతానికి చెందిన జీన్‌ ట్రెండ్‌హిల్‌ తనకు చిన్నతనం నుంచే ఈ విషయంపై ఇంట్రెస్ట్ పెరిగిందని చెబుతుంటారు.

చావులు, అంత్యక్రియలపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. గతంలో బంధువులు, మిత్రుల అంత్యక్రియలకు వెళ్లేదాన్ని. కొన్నేళ్లుగా తెలియని వారి అంత్యక్రియలకూ వెళ్తున్నాను. తరచూ శ్మశానవాటికలకు వెళ్తాను. అనాథలు, స్నేహితులు లేని వ్యక్తుల శవాలేమైనా వస్తే వాటి దహన సంస్కారాలకు నన్నే పిలుస్తుంటారు. బంధువులెవరూ రాని అపరిచితుల అంత్యక్రియలకు వెళ్లడం నాకెంతో గర్వంగా అనిపిస్తుంది.

– ట్రెండ్‌హిల్‌

ఇవి కూడా చదవండి

అంత్యక్రియలకూ వెళ్లే ఆలక్తి తనకు చిన్నప్పటి నుంచే ఉందని ట్రెండ్ హిల్ చెబుతున్నారుర. మరణం అంటే చాలా ఇష్టమని, శ్మశానవాటికలకు వెళ్లి అక్కడి సమాధులను చూస్తూ తిరుగడాన్ని చాలా సంతోషంగా ఆస్వాదిస్తుంటానంటున్నారు. అంతే కాకుండా సమాధులు మధ్య గడుపుతూ దిగిన ఫొటోలను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటారు. ఆమె14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. 20 ఏళ్ల తరుణంలో తండ్రి కన్నుమూశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..