Viral Video: యూఎస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ఆఫ్ఘన్ చేరుకున్న పైలట్‌ను ఏం చేశారంటే..?

Afghanistan Crisis:వేగవంతమైన స్వాధీనం తరువాత, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వదిలిపెట్టిన సైనిక పరికరాలను తాలిబాన్లు ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

Viral Video: యూఎస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ఆఫ్ఘన్ చేరుకున్న పైలట్‌ను ఏం చేశారంటే..?
Taliban Honour Afghan Pilot
Follow us

|

Updated on: Sep 08, 2021 | 8:29 PM

Taliban honour Afghan pilot: ఆఫ్ఘానిస్థాన్ దేశాన్ని పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వం మెల్లమెల్లగా తన అధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లకు తొలిసారిగా చైనా మద్దతు ప్రకటించింది. తాలిబన్ల పాలనను స్వాగతించింది. ఆఫ్ఘన్‌ ప్రజలు తమ గమ్యాన్ని స్వతంత్రంగా నిర్ణయించునే హక్కును గౌరవిస్తుందని ప్రకటించింది. ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన వేగవంతమైన స్వాధీనం తరువాత, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వదిలిపెట్టిన సైనిక పరికరాలను తాలిబాన్లు ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. యూఎస్ బలగాల నుండి బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను సైతం లాక్కున్న తర్వాత.. ఆప్ఘన్ పైలట్‌ను తాలిబాన్ వ్యక్తులు ఘనంగా స్వాగతించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో తాలిబాన్ ఇద్రిస్‌కు పూలమాల వేసినట్లు కనిపిస్తుంది.

గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరిన అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌తో సహా ఇతర ప్రాంతాల్లో బిలియన్ల విలువైన సైనిక ఆయుధాలు, పరికరాలను విడిచిపెట్టాయి. యూఎస్ మిలిటరీ అనేక సైనిక విమానాలు, నైట్ విజన్ పరికరాలు, సైనిక వాహనాలను ఆఫ్ఘనిస్తాన్‌లో ఇతర అధునాతన యంత్రాలతో వదిలివేసింది. తాలిబాన్లు 2000 పైగా సాయుధ వాహనాలు, UH-60 బ్లాక్ హాక్స్, మిలటరీ డ్రోన్‌లతో సహా దాదాపు 40 విమానాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. కాగా, ఓపెన్ సోర్స్ సమాచారం ప్రకారం, 2002 నుంచి 2017 మధ్య కాలంలో అమెరికా.. ఆఫ్ఘనిస్తాన్‌కు 28 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఆయుధాలను సరఫరా చేసింది.

మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్‌లో బిలియన్ల విలువైన ఆయుధాలను వదిలిపెట్టినందుకు జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్‌పై దౌత్యవేత్త నిక్కి హేలీ మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం గుర్తించకుండా నిరోధించడానికి ఆమె ఆన్‌లైన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రపంచం ముందు బిడెన్ పరిపాలన అమెరికాను ‘అవమానపరిచింది’ అని హేలీ ఆరోపించారు. Read Also… Pawan-Harish Movie: పవన్‌ ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉండండి.. హరీష్‌ శంకర్‌ సినిమా అప్‌డేట్‌ వస్తోంది. ఎప్పుడో తెలుసా.?

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..