Pawan-Harish Movie: పవన్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. హరీష్ శంకర్ సినిమా అప్‌డేట్ వస్తోంది. ఎప్పుడో తెలుసా.?
Harish-Pawan Movie: రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత మళ్లీ 'వకీల్‌సాబ్'తో రీఎంట్రీ ఇచ్చారు హీరో పవన్ కళ్యాణ్. రీఎంట్రీ సినిమాతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న పవన్.. వరుస సినిమాలకు సైన్ చేస్తూ..
Pawan-Harish Movie: రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత మళ్లీ ‘వకీల్‌సాబ్’తో రీఎంట్రీ ఇచ్చారు హీరో పవన్ కళ్యాణ్. రీఎంట్రీ సినిమాతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న పవన్.. వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు. ఇందులో భాగంగా ప్రకటించిన సినిమాల్లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. పవన్ వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సమయంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో సహజంగానే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే హరీశ్ కూడా ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా కథను సిద్ధం చేసుకున్నారని టాక్. ఈ సినిమా ప్రీలుక్‌ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ట్వీట్ చేస్తూ.. ‘మరో స్థాయి వేడుకలకు సిద్ధమవ్వండి. రేపు ఉదయం 9:45 గంటలకు పవర్ ప్యాక్డ్ ప్రకటన రానుంది’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆ సర్‌ప్రైజ్ ఏంటా.? అని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. మరి రేపు ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేస్తారా.? లేదా పవన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారా.? చూడాలి.
Get ready for Next Level Celebrations ??
A POWER PACKED ANNOUNCEMENT will enthrall you tomorrow at 9:45 AM ??@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @venupro pic.twitter.com/1uTGZpRNUd
— Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2021
Also Read: Pooja Hegde: మరో రెండు భారీ ఆఫర్లు కొట్టేసిన బుట్టబొమ్మ.. ఇద్దరు మెగా హీరోలతో నటించనున్న పూజా.?
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముగిసిన రానా విచారణ.. కెల్విన్‌తో కలిపి 7 గంటల పాటు..