Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: ఆటలాడితే అంతే సంగతులు.. మహిళల క్రీడలపై నిషేధం విధించిన తాలిబన్లు..

Women Sports Ban: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి అరచకాలు మొదలయ్యాయి. దీంతో ఆప్ఘనిస్తాన్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే తాలిబన్లు కఠినమైన

Afghanistan Crisis: ఆటలాడితే అంతే సంగతులు.. మహిళల క్రీడలపై నిషేధం విధించిన తాలిబన్లు..
Follow us
Subhash Goud

|

Updated on: Sep 08, 2021 | 2:30 PM

Women Sports Ban: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి అరచకాలు మొదలయ్యాయి. దీంతో ఆప్ఘనిస్తాన్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే తాలిబన్లు కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. బాలికలకు విద్య అవసరం లేదంటూ ప్రకటించారు. బాలికలు, మహిళలు నాలుగు గోడల మధ్య ఉండాల్సిందేనని హుకూం జారీ చేశారు. దీంతో ఆప్ఘనిస్తాన్ ప్రజలు ప్రాణాలకు తెగించి బయట దేశాలకు వదిలి వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అఫ్గాన్ మహిళలు క్రికెట్‌తో సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనలేరు. ఎందుకంటే క్రీడలు వారి శరీరాలను బహిర్గతం చేస్తాయని.. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్లు బుధవారం ప్రకటించారు. మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబాన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ మీడియాతో పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే అనేకమంది ఆఫ్ఘన్ క్రీడాకారులు దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ మహిళా క్రికెట్ జట్టు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారికోసం తాలిబన్లు గాలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

కాగా.. మహిళా విద్యార్థులకు కేవలం మహిళా టీచర్లు మాత్రమే బోధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్ఘన్‌లో విశ్వవిద్యాలయాలకు హాజరయ్యే మహిళలు తప్పనిసరిగా బుర్ఖాను ధరించాలని.. నికాబ్ (ముఖాన్ని కప్పుకునే దుస్తులు) ధరించాలని తాలిబాన్లు వెల్లడించారు. పరదా పద్దతి ప్రకారమే క్లాసులు జరుగుతాయని వెల్లడించారు. ఈ ఉత్తర్వులు కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. తాలిబాన్ మొదటి పాలన 2001లో ముగిసి.. తాజాగా మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే. ముల్లా హసన్ అఖుంద్ నేతృత్వంలో కొత్త ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబాన్లు మంగళవారం ప్రకటించారు.

ఇవీ కూడా చదవండి:

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం..వర్గాల లెక్కలు తేలలేదు..పాలన గందరగోళమే!

Taliban Rule: తాలిబాన్ ప్రభుత్వంలో ఆ మంత్రి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్..అతనిపై ఎంత రివార్డు ఉందో తెలిస్తే షాక్ అవుతారు..