AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban: ఒకరు ఆత్మాహుతి దాడుల్లో మాస్టర్.. మరొకరు జైలు నుంచి విడుదలైన ఉగ్రవాది.. కొలువుదీరిన తాలిబన్ సర్కార్..

ఆఫ్ఘన్‌లో పాక్‌ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముల్లా మహ్మద్‌ హసన్‌కు ప్రధానమంత్రి పదవి దక్కింది. అయితే ఐక్యరాజ్యసమితి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో టాప్ 5లోనివారు ఇప్పుడు తాలిబన్ కేబినెట్‌లో కీలక మంత్రులు..

Taliban: ఒకరు ఆత్మాహుతి దాడుల్లో మాస్టర్.. మరొకరు జైలు నుంచి విడుదలైన ఉగ్రవాది.. కొలువుదీరిన తాలిబన్ సర్కార్..
Mullah Hasan Akhund
Sanjay Kasula
|

Updated on: Sep 08, 2021 | 2:58 PM

Share

ఆఫ్ఘన్‌లో పాక్‌ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముల్లా మహ్మద్‌ హసన్‌కు ప్రధానమంత్రి పదవి దక్కింది. పాకిస్తాన్‌ ముద్ర కొత్తి కేబినెట్‌లో స్పష్టంగా కనబడింది. పాక్‌ తొత్తులుగా వ్యవహరించే హక్కానీ నెట్‌వర్క్‌కే కీలక పదవులు లభించాయి. ఎవరు ఊహించని విధంగా ముల్లా మహ్మద్‌ హసన్‌కు ప్రధానమంత్రి పదవి దక్కింది. తాలిబన్ల సుప్రీం లీడర్‌ అకుంజాదాకు మహ్మద్‌ హసన్‌ అత్యంత సన్నిహితుడు. తాలిబన్లకు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆయన్ను ప్రధానిగా ఎంపిక చేశారు.

అయితే.. ప్రభుత్వంలో 33 మంది మంత్రులను నియమించారు. వారిలో ఐదుగురిని ఐక్యరాజ్యసమితి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ప్రకటించింది. దేశ హోం మంత్రి తలపై 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. అదే సమయంలో అమెరికా ప్రమాదకరమైన గ్వాంటనామో బే నుంచి విడుదలైన వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ నిఘా సంస్థ అధిపతిగా వ్యవహరిస్తున్నాడు.

ఇద్దరికి డిప్యూటీ ప్రధాని పదవులు లభించాయి. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్‌కు డిప్యూటీ ప్రధాని మాత్రమే లభించింది. హక్కానీ నెట్‌వర్క్‌తో ఆధిపత్యపోరులో ఆయన వెనుకబడిపోయారు. తాలిబన్ల ప్రభుత్వానికి బరాదర్‌ నేతృత్వం వహిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కాని ఆయనకు షాకిచ్చారు తాలిబన్లు. మౌల్వీ అబ్దుల్‌ హనాఫీకి కూడా డిప్యూటీ ప్రధాని లభించింది. ఐక్యరాజ్యసమితిలో తాలిబన్ల తరపున ఆయన చర్చలు జరిపారు. అమెరికాతో శాంతిచర్చల్లో కీలక పాత్ర పోషించారు.

ముల్లా యాకూబ్‌కు కీలకమైన రక్షణశాఖ మంత్రి పదవి లభించింది. తాలిబన్ల వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ కుమారుడే ముల్లా యాకూబ్‌. హక్కానీ నెట్‌వర్క్‌లో కీలకనేత సిరాజ్‌ హక్కానీ , హోంశాఖ మంత్రి పదవిని కొట్టేశారు. ఇప్పటికి ఆయన అమెరికాకు మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా ఉన్నాడు. పాక్‌ చేతిలో అతడు కీలుబొమ్మ. ఏరికోరి ఆయనకు హోంశాఖ మంత్రి పదవిని ఇప్పించింది ఐఎస్‌ఐ . ఇతనిపై అమెరికా 5 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 37 కోట్లు) రివార్డు ప్రకటించింది. వాస్తవానికి, సిరాజుద్దీన్.. అతని తండ్రి 2008 లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు.

ముల్లా అమీర్‌ఖాన్ విదేశాంగశాఖ మంత్రిగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అబ్బాస్‌ స్టాన్‌కిజాయ్‌కి విదేశాంగశాఖ సహాయమంత్రి పదవి దక్కింది. ఖతార్‌ లోని తాలిబన్ల బృందానికి ఆయన నేతృత్వం వహించారు. శాంతిచర్చల్లో కీలకపాత్ర పోషించారు.

అయితే ఆఫ్ఘన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పాక్‌ ప్రభుత్వమే కీలక పాత్ర పోషించింది. పాక్‌ చెప్పినవాళ్లకు ముఖ్యంగా హక్కానీ నెట్‌వర్క్‌కే ఎక్కువ పదవులు లభించాయి. పాక్‌ చేతిలో తాలిబన్లు కీలుబొమ్మలుగా వ్యహరిస్తారని స్పష్టమయ్యింది.

దాడులకు హక్కానీ బాధ్యుడు

పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న తాలిబాన్ల ఆర్థిక, సైనిక ఆస్తులను హక్కానీ గ్రూపు పర్యవేక్షిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులను ప్రారంభించిన వ్యక్తి హక్కానీ.

పాకిస్తాన్‌లో కూర్చుని ఆఫ్ఘనిస్తాన్‌లో దాడులు..

ఇది మాత్రమే కాదు సిరాజుద్దీన్ హక్కానీ పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతాని ఇతని అడ్డా.. ఇతనికి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హక్కానీ పాకిస్తాన్‌లో కూర్చుని ఆఫ్ఘనిస్తాన్‌లో అనేక తీవ్రవాద దాడులు చేయిస్తుంటాడు. వీటిలో US , NATO దళాలు లక్ష్యంగా చేయించాడు. అంతే కాకుండా.. 2008లో హమీద్ కర్జాయ్‌ని చంపే కుట్రలో సిరాజుద్దీన్ హక్కానీ కూడా పాల్గొన్నాడు.

2001 లో సిరాజుద్దీన్ హక్కానీ నెట్‌వర్క్ చీఫ్ అయ్యారు. 2008 లో హక్కానీ భారత రాయబార కార్యాలయంపై దాడి చేశాడు. ఈ ఘటనలో  58 మంది మరణించారు. 2012 లో హక్కానీ నెట్‌వర్క్‌ను అమెరికా నిషేధించింది. 2014 లో పెషావర్ పాఠశాల దాడి జరిగింది. ఈ దాడిలో 200 మంది చిన్నారులు చనిపోయారు. ఆ తర్వాత 2017 కాబూల్‌లో జరిగిన దాడిలో 150 మందికి పైగా మరణించారు.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు