AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం..వర్గాల లెక్కలు తేలలేదు..పాలన గందరగోళమే!

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో తమ కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించారు. ఈ ప్రభుత్వం పేరు 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్'.

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం..వర్గాల లెక్కలు తేలలేదు..పాలన గందరగోళమే!
Taliban New Government
KVD Varma
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 08, 2021 | 3:30 PM

Share

Afghanistan Crisis: తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో తమ కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించారు. ఈ ప్రభుత్వం పేరు ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్’. దీనికి ప్రధాన మంత్రి ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ నేతృత్వం వహిస్తారు. అతనికి ముల్లా బరదర్‌తో సహా ఇద్దరు డిప్యూటీ పీఎంలు ఉంటారు. గత రెండు సంవత్సరాలుగా తాలిబాన్లు తాము అధికారంలోకి వస్తే అందరినీ కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతూ వచ్చారు. అయితే ఈ ప్రభుత్వంలో ఆఫ్ఘనిస్తాన్‌లో వివిధ గ్రూపుల వాటా కనిపించడం లేదు. మరోవైపు మంత్రుల కేర్ టేకర్ కౌన్సిల్ ఇంకా ప్రకటించాల్సి ఉందని తాలిబాన్ పేర్కొంది. సంకీర్ణ ప్రభుత్వం గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పింది.

33 మంది మంత్రులతో కూడిన ప్రభుత్వంలో మొత్తం 33 మంది మంత్రులు నియమితులయ్యారు. వీరిలో 30 మంది పష్టున్లు, ఇద్దరు తాజికులు, ఒకరు ఉజ్బెక్ మూలం నుంచి వచ్చిన వారు ఉన్నారు.  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మంత్రులు (హక్కానీ నెట్‌వర్క్) కూడా వీరిలో ఉన్నారు.  ఆఫ్ఘనిస్తాన్ యువత, మహిళలు, రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంకాలేదు. దేశంలో అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీ అయిన హజారా గ్రూప్‌ నుంచి కూడా ఈ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదు.

తాలిబన్ సీనియర్ నాయకులు మంత్రి పదవులు పంచుకున్నారు. తాలిబాన్లలో వివిధ గ్రూపుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను తగ్గించకోవడానికి మంత్రి పదవులను వారిలో వారు పంచుకున్నారని  తేటతెల్లమవుతోంది. తాలిబన్ల‌లో వివిధ గ్రూపుల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించడానికి సీనియర్ తాలిబాన్ నాయకులను మంత్రులుగా చేసినట్లు స్పష్టమవుతోంది.

ప్రపంచవ్యాప్త గుర్తింపు కష్టం..

చాలా మంది మంత్రులకు మంత్రిత్వ శాఖను నిర్వహించడానికి అవసరమైన అర్హతలు లేదా అనుభవం లేదు. ఆఫ్గన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో అక్కడ పాలనలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశంలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత మంత్రులతో కూడిన  తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా  గుర్తింపు సాధించడం చాలా కష్టమంటున్నారు. దీనికి కారణాలు విశ్లేషిస్తూ..  తాలిబన్లకు ఇప్పటికే ఉన్న ఉగ్రవాద ముద్రతో పాటు.. ప్రస్తుత మంత్రివర్గంలోకి అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్న హక్కానీని తీసుకోవడాన్ని గుర్తుచేస్తున్నారు.

వికలాంగ ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్‌‌లో ప్రభుత్వాన్ని నడపడం చాలా క్లిష్టమైనది. పరిపాలన కోసం ప్రభుత్వానికి ఆర్థిక ఖజానా చాలా అవసరం. అయితే తాలిబన్లకు గుర్తింపు లేకుండా.. ఆర్థిక వ్యవస్థ అండగా నిలిచే అవకాశం లేదు. చైనా, పాకిస్తాన్ సహాయంపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

తాలిబాన్లు తమ మధ్య పదవులను విభజించారు..

తాలిబాన్ అధిపతి షేక్ హిబ్దుల్లా అఖుంద్‌జాదా సుప్రీం నాయకుడిగా ఉంటారు. ఆయన్ను అమీర్-ఉల్-ఆఫ్ఘనిస్తాన్ అని పిలుస్తారు. ప్రభుత్వంలోని మొత్తం 33 మంది మంత్రులు, ప్రధాన మంత్రి అందరూ తాలిబాన్ సంస్థకు చెందిన వారే.

Also Read: Taliban Rule: తాలిబాన్ ప్రభుత్వంలో ఆ మంత్రి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్..అతనిపై ఎంత రివార్డు ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

Afghanistan Crisis:ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్.. ఇది తాత్కాలికమే!