AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farooq Abdullah: ఆఫ్ఘానిస్తాన్ కొత్త పాలనపై సంచలన వ్యాఖ్యలు.. చిక్కుల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇంతకీ ఎమన్నారంటే..?

మహిళలతో పాటు జర్నలిస్టులను కూడా చితకాబాదుతున్నారు. కశ్మీర్‌ నేతలు ఫరూక్‌, మెహబూబా తాలిబన్లకు మద్దతుగా స్టేట్‌మెంట్లు ఇవ్వడంపై వివాదం చెలరేగుతోంది.

Farooq Abdullah: ఆఫ్ఘానిస్తాన్ కొత్త పాలనపై సంచలన వ్యాఖ్యలు.. చిక్కుల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇంతకీ ఎమన్నారంటే..?
Farooq Abdullah
Balaraju Goud
|

Updated on: Sep 08, 2021 | 10:09 PM

Share

Afghanistan Government: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా వివాద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. ప్రపంచమంతా తాలిబన్ల చర్యలతో భయాందోళన వ్యక్తం చేస్తుంటే.. ఆయన మాత్రం వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసి అనుహ్యంగా ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు అనేక అరాచకాలకు పాల్పడుతున్న సంఘటనలు వింటూనే ఉన్నాం. తాలిబన్ల దాష్టికానికి భయపడి వేల మంది అఫ్ఘాన్లు దేశం వదిలి పారిపోతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితులను పక్కన పెట్టి ప్రజలకు మంచి పాలన అందిస్తారని తాలిబన్లపై ఫారూఖ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అది కూడా ఇస్లామిక్ నియమాల ఆధారంగా పాలన సాగిస్తారని ఫారూఖ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అఫ్ఘానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్లు మంగళవారం ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుండ్ ఈ తాత్కాలిక ప్రభుత్వానికి బాధ్యత వహించనున్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ స్పందిస్తూ ‘‘ఇస్లాం నియమాలను ఆధారం చేసుకుని తాలిబన్లు ఉత్తమ పాలన అందిస్తారని ఆశిస్తున్నాను. నూతనంగా ఎన్నికైన నాయకత్వం మానవ విలువలను కాపాడాలని నేను కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. మరోవైపు, తాలిబన్లు ఎవరిని వదలడంలేదు. తాలిబన్ల రాక్షస పాలనలో మహిళలకు నరకం కన్పిస్తోంది. మహిళలతో పాటు జర్నలిస్టులను కూడా చితకాబాదుతున్నారు. కశ్మీర్‌ నేతలు ఫరూక్‌, మెహబూబా తాలిబన్లకు మద్దతుగా స్టేట్‌మెంట్లు ఇవ్వడంపై వివాదం చెలరేగుతోంది.

తాలిబన్లకు మానవత్వం లేదని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజే రుజువయ్యింది. కాబూల్‌లో వాళ్లకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులగా మహిళలు ఆందోళన చేస్తున్నారు. మంగళవారం మహిళలపై కాల్పులు జరిపిన తాలిబన్లు తాజాగా తమ ప్రతాపాన్ని చూపించారు. కొత్త ప్రభుత్వంలో మహిళలకు ఎందుకు భాగస్వామ్యం లేదని ప్రశ్నించినందుకు నడిరోడ్డుపై చితకబాదారు . మధ్యయుగం నాటి శిక్షలను అమలు చేస్తూ రాక్షసత్వాన్ని చాటుకున్నారు. ఆందోళన చేస్తున్న మహిళను బెల్ట్‌తో కొట్టాడు ఓ తాలిబన్‌ ఉగ్రవాది

మహిళల ఆందోళనను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులను కూడా విడిచిపెట్టలేదు తాలిబన్లు. ఐదుగురిని అదుపు లోకి తీసుకొని విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులకు తీవ్రగాయాలయ్యాయి. కాబూల్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ఎడిటర్‌ను కూడా చితకబాదారు తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్‌లో పత్రికా స్వేచ్చకు చోటు లేదని నిరూపించారు. అయితే తాలిబన్లకు మద్దతిచ్చే విధంగా కొందరు కశ్మీర్‌ నేతలు మాట్లాడడం సంచలనం రేపుతోంది. తాలిబన్లు మంచిపాలన అందిస్తారని ఆశిస్తునట్టు తెలిపారు మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా. స్క్రోలింగ్‌ ( తాలిబన్లు అందరికి న్యాయం చేస్తారని భావిస్తున్నా.. మంచిపాలన అందిస్తారని ఆశిస్తున్నా..మానవహక్కులను కాపాడుతూ ఇస్లామిక్‌ చట్టాలను అమలు చేస్తారని అనుకుంటున్నా అంటూ పేర్కొన్నారు.

మరోవైపు ఆఫ్ఘన్‌ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది. రష్యా జాతీయ భద్రతా వ్యవహారాల బృందంతో చర్చలు జరిపారు ఎన్‌ఎన్‌ఏ అజిత్‌ దోవల్‌. తాలిబన్లతో అనుసరించాల్సిన వ్యూహంతో రష్యా బృందంతో చర్చించారు దోవల్‌.

Read Also…  మనకో రూల్‌..వాళ్లకో రూల్‌.. అధికారులు వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు.. వీడియో

Big News Big Debate: కుటుంబ నియంత్రణలోనూ రాజకీయముందా?