Big News Big Debate: కుటుంబ నియంత్రణలోనూ రాజకీయముందా?

నిన్నమొన్నటిదాకా భాగ్యలక్ష్మి టెంపుల్‌ సవాళ్లతో వేడెక్కిన రాజకీయం తెలంగాణలో సరికొత్త మలుపు తిరిగింది. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ యాక్ట్‌ తెరమీదకు తీసుకొచ్చారు

Big News Big Debate: కుటుంబ నియంత్రణలోనూ రాజకీయముందా?
Big News Big Debate
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 08, 2021 | 10:02 PM

జనాభా తగ్గించడానికి మతాలకు లింకేంటి.? కుటుంబ నియంత్రణ చట్టం BJP విధానమా? యూపీ, అసొం బిల్లుల టార్గెట్‌ మైనార్టీలేనా? తెలంగాణలో రాజకీయం ఓపెన్‌ అయిందా?

నిన్నమొన్నటిదాకా భాగ్యలక్ష్మి టెంపుల్‌ సవాళ్లతో వేడెక్కిన రాజకీయం తెలంగాణలో సరికొత్త మలుపు తిరిగింది. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ యాక్ట్‌ తెరమీదకు తీసుకొచ్చారు. యూపీ, అసొంలో పెట్టిన కుటుంబ నియంత్రణ చట్టాలను తెలంగాణ తొలిబిల్లుగా తెస్తామనడం ద్వారా రాజకీయ రచ్చకు తెరలేపారు. పనిలో పనిగా మైనార్టీ రిజర్వేషన్లపైనా మాట్లాడి తేనెతుట్టేను కదుపుతున్నారు.

ఒకరు చాలు. ఇద్దరు పిల్లలు వద్దు. ముగ్గురు అసలే వద్దు అంటూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జనాభా నియంత్రణ బిల్లును తీసుకొస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ BJP చీఫ్‌ బండి సంజయ్‌. ముస్లిం రిజర్వేషన్లవల్ల బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా పోతున్నాయన్నాయని ఆరోపించారు. దీంతో BCలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు బండి‌. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే UP ప్రభుత్వం చేసినట్లు జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామన్నారు సంజయ్‌.

విపక్షాల వాదనేంటి? ఆయన మాటలకు స్ట్రాంగ్‌ కౌంటర్లు పడుతున్నాయి. బండి సంజయ్‌ కాదు కదా ఆయన తాత దిగి వచ్చినా ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. జనాభా నియంత్రణ చట్టం తెస్తామంటూ వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ ముందు ప్రధాని మోదీతో ఆ ప్రకటన చేయించాలని సవాల్‌ విసిరారు TRS MLA జీవన్‌రెడ్డి.

ఇంతకీ నియంత్రణ చేయాల్సి అవసరం ఉందా?

పాపులేషన్‌ అండ్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ దేశ జనాభాలో… 2001 హిందువులు- 84.1%- ముస్లింలు – 9.8% 2011 హిందువులు – 79.8% – ముస్లింలు -14.2% పాపులేషన్‌ గ్రోత్‌ రేట్‌ హిందువులు 2001 19.92% – 2011- 16.76% – 2021 – 16.8%( అంచనా) ముస్లింలు 2001 29.52% – 2011- 24.6% – 2021 – 18.2%( అంచనా)

తెలంగాణలో…. ఫెర్టిలిటీ రేట్‌ నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-4 హిందువులు 1.79 ముస్లిం – 1.86 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 3.51 కోట్ల జనాభా

హిందువులు – 2.99 కోట్లు- 85.09% ముస్లింలు – 44.64 లక్షలు- 12.65% క్రైస్తవులు- 4.47 లక్షలు- 1.27 శాతం

సౌతిండియాలో తక్కువగానే ఫెర్టలిటీ రేట్‌ ఉంది.. అయినా జనాభా నియంత్రణ నినాదం కేవలం రాజకీయమే అంటున్నాయి విపక్షాలు.. ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది.. వీడియో కోసం కింద లింక్‌ క్లిక్‌ చేయండి.