AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: స్కూల్‌కు వెళ్లాలని ఉందంటూ ఆఫ్ఘన్ బాలిక ఆక్రందన.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో!

ఆప్ఘనిస్తాన్ ను తాలిబాన్లు అక్రమించిన తర్వాత మహిళల హక్కులు హరించడం ఆందోళన కలిగిస్తోంది. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత రాజధాని నగరం కాబూల్‌తో సహా ఆఫ్ఘనిస్తాన్‌లోని పాఠశాలలు ఒక నెలపాటు మూతపడ్డాయి.

Afghanistan: స్కూల్‌కు వెళ్లాలని ఉందంటూ ఆఫ్ఘన్ బాలిక ఆక్రందన.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో!
Education Instistution Reopening
Phani CH
|

Updated on: Sep 25, 2021 | 12:38 PM

Share

ఆప్ఘనిస్తాన్ ను తాలిబాన్లు అక్రమించిన తర్వాత మహిళల హక్కులు హరించడం ఆందోళన కలిగిస్తోంది. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత రాజధాని నగరం కాబూల్‌తో సహా ఆఫ్ఘనిస్తాన్‌లోని పాఠశాలలు ఒక నెలపాటు మూతపడ్డాయి. దేశంలోని మదర్సస్, ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు తెరవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతూ తాలిబాను ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అబ్బాయిలకు మాత్రమే పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. తాలిబాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో అమ్మాయిల గురించి ప్రస్తావించలేదు. పాఠశాలలకు ఉపాధ్యాయులు, మగ విద్యార్థులే హాజరు కావాలని ప్రకటనలో ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది.

తమకూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలని అమ్మాయిలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఒకరికొకరు ఫొటోలు, వీడియోలు షేరు చేసుకున్నారు. ఆప్ఘన్ జర్నలిస్ట్ బిలాల్ సర్వరీ ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో ఓ బాలిక అమ్మాయిలకు చదువు అవసరం అంటూ గట్టిగా మాట్లాడారు. దేశం అభివృద్ధికి అమ్మాయిలు చదువుకోవటం అవసరమని చెప్పారు.

దేశం కోసం పని చేయడానికి ఓ మంచి అవకాశం వచ్చిందన్నారు. మహిళలకు అల్లా హక్కుల కోసం పోరాడానికి అల్లా అవకాశం కల్పించినట్లు చెప్పారు. హక్కులు హరించడానికి తాలిబాన్లు ఎవరు అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ రోజు ఉన్న బాలికలు రేపు తల్లులు అవుతారు. అమ్మాయిలు చదువుకోకుంటే వారి పిల్లలకు ఎలా నడవడిక, చదువు నెర్పుతారని ప్రశ్నించారు. నేను కొత్త తరం నుంచి వచ్చాను. నేను ఇంట్లో తిని పడుకోవాడానికి పుట్టలేదన్నారు. నేను పాఠశాలకు వెళ్లాలని చెప్పారు. దేశం అభివృద్ధి కోసం ఎదైనా చేయాలని ఉందని చెప్పారు. చదువు లేకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. నేను విద్యను పొందలేకపోతే ఆఫ్ఘానిస్తాన్ లోని ఏ బాలిక చదువుకోలేదన్నారు. మాకు చదువు లేకుంటే ప్రపంచంలో మాకు విలువ ఉండదని చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Shradda Kapoor: సోషల్ మీడియా లో హలచల్ చేస్తున్న శ్రద్ధాకపూర్ అందాలు..

K.Viswanath-Ram Charan: ఒకే ఫేమ్‌లో కనువిందు చేస్తున్న కళాతపస్వి కే. విశ్వనాథ్.. మెగా హీరో రామ్ చరణ్..