ఆఫ్ఘనిస్థాన్‌పై పకృతి కన్నెర్ర.. వరదల బీభత్సంతో 51మంది సహా 300 మంది మృతి.. సర్వం కోల్పోయి అల్లాడుతున్న ప్రజలు..

CNN నివేదిక ప్రకారం ఇప్పటివరకు వరదల కారణంగా 300 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారిలో 51 మంది చిన్నరులున్నట్లు వెల్లడించారు. అనేక అంతర్జాతీయ సహాయ సంస్థలు, వివిధ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు మందులు, ఆహారం, భద్రత, అత్యవసర కిట్‌లు మొదలైన సహాయ సామగ్రిని సరఫరా చేయడంలో నిమగ్నమై ఉన్నాయి.

ఆఫ్ఘనిస్థాన్‌పై పకృతి కన్నెర్ర.. వరదల బీభత్సంతో 51మంది సహా 300 మంది మృతి.. సర్వం కోల్పోయి అల్లాడుతున్న ప్రజలు..
Afghanistan Flash Floods
Follow us

|

Updated on: May 13, 2024 | 6:05 PM

యుద్ధం నుంచి బయటపడిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆఫ్ఘనిస్థాన్‌కు మరో సమస్య ఎదురైంది. శుక్రవారం నుంచి దేశంలో సంభవించిన వరదల కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోంది. వరదల కారణంగా పొలాలు, రోడ్లు, గ్రామాలు, నగరాల్లోని ఇళ్లు కొట్టుకుపోయాయి. పంటలు నాశనం అయ్యాయి. వరదలు ఆ దేశంలో భారీ విధ్వంసం సృష్టించాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్సులో బదక్షన్, ఘోర్, బగ్లాన్, హెరాత్ వరదల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

CNN నివేదిక ప్రకారం ఇప్పటివరకు వరదల కారణంగా 300 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారిలో 51 మంది చిన్నరులున్నట్లు వెల్లడించారు. అనేక అంతర్జాతీయ సహాయ సంస్థలు, వివిధ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు మందులు, ఆహారం, భద్రత, అత్యవసర కిట్‌లు మొదలైన సహాయ సామగ్రిని సరఫరా చేయడంలో నిమగ్నమై ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

వార్తా సంస్థ AP నివేదిక ప్రకారం, ‘సేవ్ ది చిల్డ్రన్’ అనే సహాయక బృందం పిల్లలు, బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి మొబైల్ హెల్త్, చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్‌లతో కూడిన “క్లినిక్ ఆన్ వీల్స్”ని పంపింది.

వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు

బగ్లాన్ ప్రాంతంలోని ఐదు జిల్లాలను వరద తీవ్రంగా ప్రభావితం చేసింది. సేవ్ ది చిల్డ్రన్ కంట్రీ డైరెక్టర్ అర్షద్ మాలిక్ వార్తా సంస్థ APతో మాట్లాడుతూ “ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆస్తులు కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదలు గ్రామాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. జంతువులు మరణించాయి. పిల్లలు సర్వస్వం కోల్పోయారు. ఈ ప్రాంతంలోని కుటుంబాలు మూడేళ్లుగా కరువుతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వారికి తక్షణ సహాయం అందించాలని ఆయన అన్నారు.

పిల్లలు, బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి ఒక మొబైల్ హాస్పిటల్, చైల్డ్ హెల్ప్ టీమ్‌లతో కూడిన “క్లినిక్ ఆన్ వీల్స్”ని సేవ్ ది చిల్డ్రన్ అనే సహాయక బృందం పంపిందని AP నివేదించింది.

సాయం అందడం కష్టంగా మారింది

నివేదికల ప్రకారం వెయ్యికి పైగా ఇళ్లు, వేల హెక్టార్ల వ్యవసాయ భూమి, జంతువులు వరదలో ధ్వంసమయ్యాయి. అనేక వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం కోసం ట్రక్కులు చేరుకోవడం కష్టంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో వరదల వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణమే సహాయం చేయాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) సభ్య దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలను శనివారం కోరింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ఆకస్మిక వరదల వల్ల నష్టపోయిన బాధితుల కోసం మానవతా సహాయం కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles