AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా.. సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా.. రెసిపీ మీ కోసం

వేసవి నుంచి ఉపశమనం కోసం లేదా ఇష్టమని మార్కెట్ లో దొరికే ఐస్ క్రీమ్ ని పదే పదే తినేస్తుంటే.. ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకని మార్కెట్ లో కొనే బదులు ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసి పిల్లలకు, కుటుంబ సభ్యులకు తినడానికి అందించవచ్చు. ఐస్ క్రీమ్ తయారు చేయడానికి సహజ పదార్థాలను ఉపయోగించవచ్చు. ఇంట్లో తయారు చేయడం కూడా చాలా సులభం.

ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా.. సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా.. రెసిపీ మీ కోసం
Homemade Ice Cream
Surya Kala
|

Updated on: May 13, 2024 | 5:40 PM

Share

చాలా మంది వేసవి కాలంలో ఐస్‌క్రీం తినడానికి ఇష్టపడతారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా రోజూ ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం చాలా రకాల ఐస్‌క్రీమ్‌లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అయితే వీటి తయారీకి రసాయనాలను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో వేసవి నుంచి ఉపశమనం కోసం లేదా ఇష్టమని మార్కెట్ లో దొరికే ఐస్ క్రీమ్ ని పదే పదే తినేస్తుంటే.. ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకని మార్కెట్ లో కొనే బదులు ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసి పిల్లలకు, కుటుంబ సభ్యులకు తినడానికి అందించవచ్చు. ఐస్ క్రీమ్ తయారు చేయడానికి సహజ పదార్థాలను ఉపయోగించవచ్చు. ఇంట్లో తయారు చేయడం కూడా చాలా సులభం.

కాఫీ ఐస్ క్రీమ్:

ఈ రుచికరమైన ఐస్ క్రీం చేయడానికి ఒక పాన్‌లో పాలు, చక్కెర వేసి 10 నిమిషాలు తక్కువ మంటపై మరిగించండి. ఈ సమయంలో పాలు గిన్నెలో అడుగు అంట కుండా కదుపుతూ ఉండండి. ఇలా పాలు చిక్కబడే వరకూ మరిగించి తరువాత గిన్నె మీద మూత పెట్టి చల్లబరచడానికి వదిలివేయండి. ఇప్పుడు ఈ పాలు, పంచదార మిశ్రమంలో కాఫీ పౌడర్, విప్డ్ క్రీమ్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో పోసి కనీసం 4 గంటలు లేదా రాత్రి అంతా ప్రిడ్జ్ లో పెట్టి ఉంచండి. అనంతరం చాక్లెట్ సిరప్, డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.

మ్యాంగో ఐస్ క్రీమ్:

మ్యాంగో ఐస్‌క్రీం చేయడానికి ఒక పాన్‌లో పాలు తీసుకుని దానిలో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1/4 కప్పు చక్కెర వేసి.. బాగా మిక్స్ చేయండి. తర్వాత తక్కువ మంట మీద ఉడికించాలి. ఈ మిశ్రమం 10 నుంచి 12 నిమిషాల్లో కాస్త చిక్కగా అయ్యాక.. స్టవ్ మీద నుంచి దింపి ఓ పక్కకు పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు మరో గిన్నెలో 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకుని అందులో ఈ పాల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమంలో సగం మామిడి ప్యూరీని కలిపిన తర్వాత ఈ మిశ్రమంలో కలపండి. మీరు మీ ఎంపిక ప్రకారం పైన మామిడి క్యూబ్‌లను కూడా జోడించవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్‌లో ఉంచండి. అనంతరం మ్యాంగో ఐస్ క్రీమ్ ని సర్వ చేయండి.

ఇవి కూడా చదవండి

చాక్లెట్ ఐస్ క్రీమ్:

చాక్లెట్ ఐస్ క్రీమ్ ని తయారు చేయడానికి ఒక బాణలిలో పాలు, తాజా క్రీమ్, మిల్క్ పౌడర్ వేసి తక్కువ మంటపై 10 నిమిషాలు ఉడకనివ్వండి. అందులో పంచదార వేసి బాగా కలపండి. 10 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని చల్లబరచండి. పాలు క్రీమీగా మారిన తర్వాత దానికి చోకో చిప్స్, కోకో పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. గాలి చొరబడని డబ్బాలో లేదా కుల్ఫీ మౌల్డ్‌లో వేసి ఫ్రీజర్‌లో ఉంచండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..