AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clay Cooking: నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేస్తే ఎంత డేంజరో తెలుసా? పాత తరం పద్ధతులే బెటర్‌ అంటోన్న NIN

శరీరంలోని పోషకాహార లోపాలను పూరించడం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వరకు ఆహారం కీలక పాత్ర వహిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్' ప్రచురించిన నివేదిక ప్రకారం.. శరీరానికి వచ్చే వ్యాధుల్లో 56 శాతం తప్పుడు ఆహార అలవాట్ల వల్లే వస్తున్నాయట. సమతుల్య ఆహారంపై 'ICMR' మార్గదర్శకాలను కూడా ప్రచురించింది..

Clay Cooking: నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేస్తే ఎంత డేంజరో తెలుసా? పాత తరం పద్ధతులే బెటర్‌ అంటోన్న NIN
Clay Cooking
Srilakshmi C
|

Updated on: May 14, 2024 | 12:19 PM

Share

శరీరంలోని పోషకాహార లోపాలను పూరించడం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వరకు ఆహారం కీలక పాత్ర వహిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శరీరానికి వచ్చే వ్యాధుల్లో 56 శాతం తప్పుడు ఆహార అలవాట్ల వల్లే వస్తున్నాయట. సమతుల్య ఆహారంపై ‘ICMR’ మార్గదర్శకాలను కూడా ప్రచురించింది. నాన్ స్టిక్ పాత్రల్లో ఆహారం వండడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆరోగ్యం కోసం మట్టి పాత్రల్లో వండాలని ‘NIN’ సిఫార్సు చేస్తోంది.

అనారోగ్యకరమైన ఆహారం శరీరంలో వివిధ వ్యాధులకు కారణమవుతుంది. అయితే మనం ఏ పాత్రలు వాడుతున్నామో, ఎలా వండుతున్నామో ఓసారి గమనించుకోవాలి. నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో నాన్‌స్టిక్‌ పాత్రల వినియోగం పెరిగిపోయింది. పాతకాలం నాటి మట్టి పాత్రల వాడకం తగ్గిపోయింది. ఆరోగ్యాన్ని పాడుచేసే నాన్‌స్టిక్ వంటసామాన్లు వంటగది నిండా ఆక్రమించాయి. కానీ నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించకుండా దూరంగా ఉండాలని ‘NIN’ సూచిస్తోంది. బదులుగా పర్యావరణ అనుకూలమైనది మట్టి కుండలలో వండాలని సిఫార్సు చేస్తుంది. అలాగే ప్రోటీన్ సప్లిమెంట్లకు కూడా దూరంగా ఉండాలని ‘ICMR’ చెబుతోంది. అవి నిర్జలీకరణం, పోషకాల అసమతుల్యతకు కారణమవుతాయట. వీటివల్ల మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయని పేర్కొంది. సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టాలని, మట్టిపాత్రల్లో వంట చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని చెబుతోంది.

మట్టిపాత్రల్లో వంట చేయడం వల్ల ఏంటీ ప్రయోజనం?

తక్కువ నూనె మట్టి పాత్రల్లో రుచిగా వంట చేయొచ్చు. అలాగే ఆహారం సహజ రుచి అలాగే ఉంటుంది. ఆహారంలోని పోషక విలువలు కూడా కోల్పోవు. బదులుగా ఆహారంలో యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. మట్టి కుండల్లో వండడం వల్ల కూడా ఆహారంలోకి హానికరమైన రసాయనాలు విడుదల కావు. ఇలాంటి ఆహారం తింటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. నిజానికి, అధిక ఉష్ణోగ్రతల వద్ద నాన్‌స్టిక్‌ పాన్‌లలో వండడం వల్ల విషపదార్థాలు విడుదలవుతాయి. ఇది ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుకే NIN మట్టి కుండలలో వండాలని అలాగే స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలలో ఆహారాన్ని తినాలని సిఫార్సు చేస్తోంది. అవి ఇతర లోహ పాత్రల కంటే మన్నికైనవి. పరిశుభ్రమైనవి. పైగా శుభ్రం చేయడం కూడా చాలా సులభం. వంటేకాదు మట్టి లేదా సిరామిక్ పాత్రల్లో ఆహారాన్ని భుజించవచ్చు కూడా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.