Food Crises in Pakistan: ఓ వైపు ప్రజలు త్యాగాలు చెయ్యాలి ఒక్కపూటే తినమంటున్న పాక్ మంత్రి.. మరో వైపు కప్పు ‘టీ’ రూ. 40

Surya Kala

Surya Kala |

Updated on: Oct 14, 2021 | 3:42 PM

Food Crises in Pakistan: భారత్ తో వాణిజ్య వ్యాపారంపై ఆంక్షలు, మరోవైపు కరోనా వైరస్ దీంతో మన పొరుగు దేశం పాకిస్తాన్ లో తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటుంది..

Food Crises in Pakistan: ఓ వైపు ప్రజలు త్యాగాలు చెయ్యాలి ఒక్కపూటే తినమంటున్న పాక్ మంత్రి.. మరో వైపు కప్పు 'టీ' రూ. 40
Pakisthan Food Crices

Follow us on

Food Crises in Pakistan: భారత్ తో వాణిజ్య వ్యాపారంపై ఆంక్షలు, మరోవైపు కరోనా వైరస్ దీంతో మన పొరుగు దేశం పాకిస్తాన్ లో తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటుంది. దాయాది దేశంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఆదేశ మంత్రి సంచలన కామెంట్స్ చేసి.. వివాదానికి తెరలేపారు. రోజు రోజుకీ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని.. భావి తరాల భవిష్యత్ ను కాపాడుకోవాలంటే.. ప్రజలు తక్కువ తినాలని పాక్ మంత్రి సూచించారు. ముఖ్యంగా చక్కెర పిండి పదార్థాల ధరలు పెరుగుతున్నాయి కనుక వీటిని ప్రజలు తక్కువ తినాలని పాక్ దేశంలోని గిల్గిత్ బాల్టిస్తాన్ మంత్రి అలీ అమిన్ గందపూర్ సూచించారు. ప్రస్తుతం మన దేశం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుంది… కనుక పిల్లలను బానిసత్వం నుంచి కాపాడటానికి ప్రజలు ఒక్కపూట మాత్రమే తింటూ కొన్ని త్యాగాలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు పాకిస్తాన్ లో టీ అత్యధికంగాఅమ్ముడవుతుంది. ఎక్కడ చూసినా టీ తయారీ దుకాణాలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు అక్కడ రోడ్డు పక్క ఉండే ఛాయ్ షాప్ లో కూడా కప్పు టీ. రూ. 40 లకు చేరుకుంది. (మన కరెన్సీలో) దీంతో వినియోగదారులు టీ షాపుల వైపు చూసే పరిస్థితిలేదని తెలుస్తోంది. ప్ర‌స్తుతం లీట‌ర్ పాలు రూ.120 ఉండ‌గా, గ్యాస్ సిలిండ‌ర్ రూ.1500 నుంచి రూ.3000 ల‌కు పెరిగిన‌ట్టు ఛాయ్‌వాలాలు చెబుతున్నారు. ఇక భారత్ నుంచి చక్కర దిగుమతి చేసుకున్న సమయంలో చౌకగా దొరికేదని .. ఇప్పుడు వేరువేరు దేశాల నుంచి షుగర్ ను దిగుమతి చేసుకోవడంతో పీచెక్కర ధర కూడా పెరిగిందని అక్కడ స్తానికులు వాపోతున్నారు. ఇప్పుడు టీ ధర పెరిగిపోవడంతో ఛాయ్ తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని… తాము పూర్తిగా ఉపాధి కోల్పోతున్నామని టి దుకాణం దారులు వాపోతున్నారు.

Also Read:  సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చిన శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu