Watch Video: ఆకాశం నుంచి దూసుకొచ్చిన ఉల్క.. ఇది భూమికంటే పురాతనమైనదట!
గత ఏడాది జూన్ నెలలో ఆమెరికాలోని జార్జియాలో పడిన ఉల్క శకలం గురించి శాస్త్రవేత్తలు కీలక విషయాలను కనుగొన్నారు. ఈ ఉల్క శకలం భూమికంటే కోట్ల సంవత్సరాలు పురాతనమైనదని గర్తించారు. ఆకాశంలోంచి స్పీడుగా దూసుకొచ్చిన 23 గ్రాముల సైజున్న ఈ ఉల్క గత జూన్ 26న మెక్‌డొనౌగ్‌లో ఓ ఇంటిపైకప్పును బద్దలకొట్టుకొని నేలపై పడింది.

గత ఏడాది జూన్ నెలలో ఆమెరికాలోని జార్జియాలో పడిన ఉల్క శకలం గురించి శాస్త్రవేత్తలు కీలక విషయాలను కనుగొన్నారు. ఈ ఉల్క శకలం భూమికంటే కోట్ల సంవత్సరాలు పురాతనమైనదని గర్తించారు. గత ఏదాడి జూన్ 26న మెరుస్తూ ఆకాశంలోంచి వేగంగా దూసుకొచ్చిన ఈ ఉల్క శకలం మెక్‌డొనౌగ్‌లోని ఓ ఇంటిపై కప్పును బద్దలకొట్టుకొని భూమిపై పడింది. సూపర్ సోనిక్ వేగంతో దూసుకొచ్చిన ఈ ఉల్క భూమిపై పడినప్పుడు సెంటీమీటరున్నర లోతులో గంత ఏర్పడింది. చూడ్డానికి చిన్న చెర్రపండు సైజులో ఉన్న ఈ ఉల్క శకలం బరువు 23 గ్రాములు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమిపై పడినప్పుడు వచ్చిన శబ్ధం స్థానిక జనాలను ఉలిక్కపడేలా చేసింది.
అయితే ఇది భూమిపై పడిన విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఈ ఉల్క శకలం గురించి తెలుసుకునేందుకు దాన్ని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరిశోదనలు చేశారు. ఈ పరిశోదనల్లో సైంటిస్ట్‌లు కీలక విషయాలను కనుగొన్నారు. ఈ శకలం దాదాపు 4.56 బిలియన్ సంవత్సరాల ఏళ్లనాటిగా గుర్తించారు. అంటే ఇది భూమి కంటే 2 కోట్ల సంవత్సరాల క్రితం తయారయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే భూమి 4.54 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందన్న ఇప్పటికే ఎంతో శాస్త్రవేత్తలు అంచనాలు వేశారు. వాటిని బట్టి చూసుకుంటే ఇది భూమి కన్న పురాతనమైనదని వారు అంచనావేస్తున్నాయి.
అయితే ఈ శకలం అంగారకుడు, బృహస్పతికి మధ్య ఉన్న ఓ తోక చుక్క నుంచి విడిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే భూమిపై ఉల్కలు ఎల్లప్పుడూ పడుతూనే ఉంటాయని, కానీ చాలా వరకు మహాసముద్రాలు లేదా మారుమూల ప్రాంతాలలోనే పడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వీడియో చూడండి..
🚨#BREAKING: A geologist says a meteorite fragment that smashed through a man’s roof in Henry County, Georgia, is actually older than Earth itself. pic.twitter.com/KVxETJ3Mop
— R A W S A L E R T S (@rawsalerts) August 9, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
