Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran: అల్లర్లతో అట్టుకుడుతున్న ఇరాన్.. పోలీస్ స్థావరాలపై దాడులు.. 19 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పుడుతున్నాడు. అల్లర్లతో జహెదాన్‌ నగరం అట్టుడికింది. వేర్పాటు వాదులు జరిపిన దాడిలో 19 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా ఇందులో ముగ్గురు రివల్యూషనరీ గార్డులుండటం గమనార్హం. ఒక వైపు హిజాబ్‌..

Iran: అల్లర్లతో అట్టుకుడుతున్న ఇరాన్.. పోలీస్ స్థావరాలపై దాడులు.. 19 మంది దుర్మరణం
Iran Hijab Protest
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 02, 2022 | 7:18 AM

ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాడు. అల్లర్లతో జహెదాన్‌ నగరం అట్టుడికింది. వేర్పాటు వాదులు జరిపిన దాడిలో 19 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా ఇందులో ముగ్గురు రివల్యూషనరీ గార్డులుండటం గమనార్హం. ఒక వైపు హిజాబ్‌ అంశం ఇరాన్‌ను కుదిపేస్తుంటే మరో వైపు వేర్పాటు వాదుల దాడులు కొత్త సమస్యను తెచ్చి పెట్టాయి. తూర్పు ప్రాంత నగరం జహెదాన్‌లోని ఓ పోలీసు స్థావరంపై సాయుధులు దాడికి తెగ బడ్డారు. స్థానిక మసీదులోకి చొరబడిన కొందరు వ్యక్తులు ప్రార్థనలు ముగిసిన తర్వాత సమీపంలోని పోలీసు స్థావరంపై దాడి చేశారు. గుంపులుగా గుంపులుగా వచ్చి రాళ్లు రువ్వారు. వీరిలో కొందరు పోలీసు స్థావరం గోడలు ఎక్కారు. ఆ ప్రాంతమంతా మంటలు, దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ మెరుపు దాడిలో 19 మంది చనిపోయారు. మరో 32 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ – ఐఆర్జీ విభాగానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఈ దాడిలో ఐఆర్జీ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి సెయ్యద్ అలీ మౌసవి మరణించారని ఇరాన్‌ అధికారిక వార్త సంస్థ తెలిపింది.

కాగా ఇరాన్‌ వ్యాప్తంగా హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలకు, జహెదాన్‌ దాడికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. హిజాబ్‌ ధరించలేదనే కారణంతో అరెస్టై పోలీసుల కస్టడిలో మరణించిన మెహ్సా అమీని స్వస్థలం కుర్దులోనే జహెదాన్‌ సిటీ ఉంది. ఇరాన్‌ సరిహద్దుల వెంట పాకిస్తాన్‌, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కుర్దిస్తాన్‌ బలూచ్‌ వేర్పాటువాదుల ప్రాబల్యం ఉంది. వీరు తరచూ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌తో ఘర్షణకు దిగుతుంటారు. తాజా దాడిలో వీరి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా.. ఇరాన్ లో పరిస్థితులు రోజు రోజుకు అదుపు తప్పుతున్నాయి. దీంతో అధికార బృందం అప్రమత్తమైంది. సమాచారం విస్తృతంగా ప్రచారం కాకుండా ఉండేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను నిలిపివేసింది. ప్రభుత్వ పెద్దలు, కీలక అధికారులు మినహా ఇతరులెవరూ సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆంక్షలు విధించింది. మహ్స అమిని అనే 22 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి రాజధాని టెహ్రాన్ లో పర్యటించింది. ఆ సమయంలో ఆమె హిజాబ్ ధరించలేదంటూ మోరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ చేస్తున్న సమయంలో ఆమె కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో ఇరాన్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..