Underground Hotel: పాతాళంలో లగ్జరీ హోటల్‌.. అడుగుపెడితే మరో ప్రపంచం.. ఆశ్చర్యపోతున్న జనం.!

Underground Hotel: పాతాళంలో లగ్జరీ హోటల్‌.. అడుగుపెడితే మరో ప్రపంచం.. ఆశ్చర్యపోతున్న జనం.!

|

Updated on: Jun 19, 2023 | 9:05 AM

పాతాళ లోకం..పాతాల లోకం అనుకోవడమే కానీ అదెలా ఉంటుందో ఎవరికీ తెలీదు. పాతాల లోకం అసలు ఉందో లేదో అన్న విషయం పక్కనపెడితే భూమి లోపలి ఏకంగా 1300 అడుగుల లోతున అద్భుతమైన ప్రపంచం ప్రజలను విస్తుపోయేలా చేస్తుంది.

పాతాళ లోకం..పాతాల లోకం అనుకోవడమే కానీ అదెలా ఉంటుందో ఎవరికీ తెలీదు. పాతాల లోకం అసలు ఉందో లేదో అన్న విషయం పక్కనపెడితే భూమి లోపలి ఏకంగా 1300 అడుగుల లోతున అద్భుతమైన ప్రపంచం ప్రజలను విస్తుపోయేలా చేస్తుంది. , పైగా అక్కడ నివాసయోగ్యానికి అనువైన సకల సౌకర్యాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును అదొక అద్భుమైన హోటల్‌. ఇటీవలే బ్రిటన్‌లో ఈ అండర్‌ గ్రౌండ్‌ హోటల్‌ ప్రారంభమయింది. ఇది ప్రపంచంలోనే.. భూమికి అత్యంత లోతున ఉన్న హోటల్‌గా పేరొందింది. ఇది నార్త్‌వేల్స్‌లోని స్నోడోనియా పర్వతాలపై భూమికి 419 మీటర్ల దిగువన ఉంది. దీనిలో 4 పర్సనల్‌ ట్విన్‌-బెడ్‌ క్యాబిన్‌తో పాటు డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. అయితే ఈ హోటల్‌లోని గదులను శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ మాత్రమే బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ హోటల్‌కు వెళ్లాలంటే కొంచెం కొన్ని గంటల పాటు ట్రెక్కింగ్‌ చేసిన తరువాతనే ఈ హోటల్‌కు చేరుకోగలుగుతారు. ఈ మార్గంలో జలపాతాలు, అందమైన కొండలు, ఎగుడుదిగుడు రహదారులు, సొరంగమార్గాలు చాలానే ఉంటాయి. ఈ హోటల్‌కు వెళ్లేవారికి ఒక గైడ్‌ తోడుగా ఉంటాడు. ఈ ప్రయాణం సాగించేవారికి హార్నర్స్‌ రోప్‌, హెల్మెట్‌, బూట్లు, లైటు అవసరం అవుతాయి. ఈ హాటల్‌కు వెళ్లే మార్గంలో పలు కళాఖండాలు కనిపిస్తాయి. ముందుకు సాగుతున్నప్పుడు వీటి గురించి గైడ్‌ వివరిస్తాడు. చివరగా హోటల్‌ ఎంట్రీలో ఒక పెద్ద ఇనుప తలుపు కనిపిస్తుంది. లోనికి ప్రవేశించగానే వెల్కమ్‌ డ్రింక్‌, స్నాక్స్‌తో స్వాగతం పలుకుతారు. ఇక్కడ వెజ్‌, నాన్‌ వెజ్‌ ఆహారపదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఈ హోటల్‌లో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉంటుంది. గో బిలో అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో హోటల్‌ గదులను బుక్‌ చేసుకోవచ్చు. ఒక ప్రైవేట్‌ క్యాబిన్‌ బుకింగ్‌ ధర 36,000 రూపాయలు ఉంటుంది. గుహ రూము బుకింగ్‌ కోసం 57,000 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. దీనిలో టీ, టిఫిన్‌ ఖర్చులు కలిసి ఉంటాయి. డైలీ స్టార్‌ స్యూస్‌ వెబ్‌సైట్‌తో ఈ హోటల్‌ మేనేజర్‌ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చే అతిథులు ఇక్కడి ఏర్పాట్లను ఎంతగానో ఇష్టపడతారు. ఇక్కడ బస చేసేవారికి మంచి నిద్ర పడుతుంది. ఇక్కడికి వచ్చేవారు అన్నిరకాల ఆందోళనలను విడిచి పెట్టి, ప్రశాంతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు. అందుకే ఈ హోటల్‌కు ‘డీప్‌ స్లీప్‌’ అనే పేరుపెట్టామన్నారు. ఈ హోటల్‌లో రాళ్లమధ్యలో రూపొందించిన చిన్నచిన్న క్యాబిన్‌లు ఉంటాయి. ఇక గదుల విషయానికి వస్తే గుహలను పోలివుంటాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Follow us
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!