Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్రమ శిక్షణకు మారుపేరుగా మారిన కోతులు.. నెట్టింట వైరల్‌గా మారిన వానరాల వీడియో..

Monkeys Eating Cake Video Viral: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నాటి నుంచి ప్రపంచంలో ఏ చిన్న విచిత్రమైన సంఘటన జరిగినా వైరల్‌గా మారుతోంది. కాస్త ఆసక్తిని రేకెత్తించే సంఘటన అయితే చాలు నెట్టింట్లో...

Viral Video: క్రమ శిక్షణకు మారుపేరుగా మారిన కోతులు.. నెట్టింట వైరల్‌గా మారిన వానరాల వీడియో..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2021 | 12:31 PM

Monkeys Eating Cake Video Viral: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నాటి నుంచి ప్రపంచంలో ఏ చిన్న విచిత్రమైన సంఘటన జరిగినా వైరల్‌గా మారుతోంది. కాస్త ఆసక్తిని రేకెత్తించే సంఘటన అయితే చాలు నెట్టింట్లో వైరల్‌గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ఇలాంటి ఎన్నో వీడియోలు, పోస్ట్‌లు ప్రతి రోజూ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ కోతుల గుంపు కేక్‌ను తింటోన్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్‌ చేస్తోంది. నేచర్‌ అండ్‌ యానిమల్స్‌ అనే పేరుతోన్న ఉన్న ట్విట్టర్‌ పేజీలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. సహజంగా మనుషులు ఎవరైనా అల్లరి పనులు చేస్తుంటే.. అదేంట్రా కోతిలా బిహేవ్‌ చేస్తున్నావు అంటుంటారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న కోతులు మాత్రం క్రమశిక్షణకు మారుపేరుగా కనిపిస్తున్నాయి. దాదాపు పది కోతులు కలిసి ఒక కేకును ఎంచక్క తింటున్నాయి. అయితే ఈ క్రమంలో ఒక దానితో మరొకటి పోటీ పడకుండా బుద్ధిగా చేతులతో తీసుకుంటూ మరీ తింటున్నాయి. దీంతో ఈ కోతులను చూసి మనుషులే క్రమశిక్షణ నేర్చుకోవాలంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి కేకును తింటే వాటికి ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఏంటి అన్ని ప్రశ్నలు వస్తుండొచ్చు. అయితే ఈ కేకును ఎలాంటి హానికర పదార్థాలు లేకుండా ప్రత్యేకంగా తయారు చేశారంట. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Also Read: hypertension epidemic: రక్తపోటు బాధితులు మన దేశంలోనే ఎక్కువట.. జాగ్రత్తపడాలంటున్న వైద్యులు..