Real Hero:  అకస్మాత్తుగా ఎవరన్నా తుపాకీతో మిమ్మల్ని హ్యాండ్స్ అప్ అంటే ఏం చేస్తారు? ఇతను మాత్రం ఇలా చేశాడు..Viral Video

మనం సినిమాల్లో సహజంగా చూస్తుంటాం.. హీరో రోడ్డు మీద వెళ్ళిపోతుంటాడు. ఇంతలో ఓ దుండగుడు హఠాత్తుగా ఎదురు వస్తాడు.. ఓ వికటాట్టహాసం చేస్తాడు.. చేతిలో తుపాకీ చూపించి చంపేస్తా.. అంటాడు.

  • KVD Varma
  • Publish Date - 4:27 pm, Thu, 22 April 21
Real Hero:  అకస్మాత్తుగా ఎవరన్నా తుపాకీతో మిమ్మల్ని హ్యాండ్స్ అప్ అంటే ఏం చేస్తారు? ఇతను మాత్రం ఇలా చేశాడు..Viral Video
Robbery Defened

Real Hero: మనం సినిమాల్లో సహజంగా చూస్తుంటాం.. హీరో రోడ్డు మీద వెళ్ళిపోతుంటాడు. ఇంతలో ఓ దుండగుడు హఠాత్తుగా ఎదురు వస్తాడు.. ఓ వికటాట్టహాసం చేస్తాడు.. చేతిలో తుపాకీ చూపించి చంపేస్తా.. అంటాడు.. నీదగ్గర ఉన్నదంతా ఇచ్చేయ్ అని బెదిరిస్తాడు. దీంతో హీరో ముందు భయపడినట్టు కనిపించి.. కన్ను మూసి తెరిచేలోగా ఫట్ మని ఆ దొంగకి ఒక్క షాట్ ఇస్తాడు. అంతే.. ఆ దొంగ తుపాకీతో సహా నేలమీద పడిపోతాడు. దాదాపుగా చాలా సినిమాల్లో కనిపించే ఈ సీన్ చూసిన వెంటనే.. మనకి కూడా అలా ఎపుడాన్నా ఎవరైనా ఎదురైతే ఒక్కటి పీకాలి అన్నంత కసి వచ్చేస్తుంది. కానీ, నిజంగా అలాంటి సంఘటన ఎదురైతే మాత్రం కాళ్ళూ చేతులూ ఆడవు. ఎందుకు వచ్చిందిరా బాబూ అనుకుని జేబులు ఊడ్చి వాడి చేతిలో పెట్టేసి బతుకు జీవుడా అనుకుంటూ.. పోలీసుల దగ్గరకి పరుగు తీస్తాం..ఇంచుమించుగా ఇలాగె జరుగుతూ ఉంటుంది. కానీ, ఒకాయన మాత్రం సినిమాల్లో హీరోలా చేశాడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు.

కాలిఫోర్నియాలోని శాన్ లియాండ్రో నుంచి వచ్చిన ఓ వీడియోలో ఉన్న దృశ్యాలను చూస్తే మీరు కూడా అతనిని హీరో అని అంటారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన కారు వద్దకు నడుస్తూ వెళుతున్నాడు. ఈ లోపు రోడ్డుపై ఒక పక్క నుంచి ఇద్దరు దుండగులు అతని వైపు కదులుతున్నారు. సరిగ్గా ఆ వ్యక్తి కారు డోర్ ఓపెన్ చేస్తున్న సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులూ అతని వైపు వేగంగా కదిలారు. అందులో ఓ దుండగుడు ఆ వ్యక్తీ దగ్గరకు చేరి తుపాకీ తీసి ఎక్కుపెట్టాడు. అంతే.. తరువాతి సీన్ మెరుపు వేగంతో సినిమాల్లోలా అయిపోయింది. మన హీరో ఆ దుండగుడిని ఫేడేల్ మని ఒక్కటిచ్చుకున్నాడు. దెబ్బకి ఆ దుండగుడు బొక్క బోర్లా పడ్డాడు. రెండో దుండగుడు అక్కడి నుంచి పరుగు తీశాడు. ఆ తరువాత ఇనేముంది మన హీరోగారు రోడ్డు మీద బొక్క బోర్లా పడ్డ దుండగుడిని ఇరగదీసి వదిలేశాడు.

కింద పడ్డ మొదటి దుండగుడు “సరే, సరే … ఆల్రైట్! నన్ను వెళ్ళనివ్వండి!” అంటూ మొర పెట్టుకోవడం.. అదే విధంగా అతని సహాయంగా వచ్చిన రెండో దుండగుడు కూడా “హే, అతన్ని వెళ్లనివ్వండి” అని చెప్పడం కూడా వీడియోలో స్పష్టంగా వినబడుతోంది.

@davenewworld నుంచి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అన్నట్టు ఈ వీడియోకి క్యాప్షన్ ఏమి ఇచ్చారో తెలుసా “కాలిఫోర్నియాలో సాయుధ దోపిడీ అంత సులువుగా జరగదు” మరి చదివితేనే వావ్ అనిపిస్తోంది కదూ.. ఇక ఆ వీడియో చూస్తే.. అందుకే మీకోసం ఆ వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Fifty Shades of Whey (@davenewworld_)

Also Read: న్యూయార్క్ పయనమైన షారుఖ్ కుటుంబం.. కరోనా నుంచి తప్పించుకునేందుకేనా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Free Oxygen supply: కారు అమ్మేసి ఆక్సిజన్ ఉచిత సరఫరా..నెటిజన్ల హృదయాలను ‘షేక్’ చేశావు కదా సామీ!