AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Oxygen supply: కారు అమ్మేసి ఆక్సిజన్ ఉచిత సరఫరా..నెటిజన్ల హృదయాలను ‘షేక్’ చేశావు కదా సామీ!

కరోనా కల్లోలంలో ఆక్సిజన్ కొరత పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Free Oxygen supply: కారు అమ్మేసి ఆక్సిజన్ ఉచిత సరఫరా..నెటిజన్ల హృదయాలను 'షేక్' చేశావు కదా సామీ!
Free Oxygen
KVD Varma
|

Updated on: Apr 22, 2021 | 4:18 PM

Share

Free Oxygen supply: కరోనా కల్లోలంలో ఆక్సిజన్ కొరత పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కోసం ప్రయత్నాలు ప్రారంభించినా.. ఒకేసారి పెరిగిపోయిన కరోనా కేసులతో సరిపడినంతగా అందించడానికి కష్టంగా మారింది. ఈ పరిస్తితులల్లో ముంబయికి చెందిన ఓ యువకుడు ఆక్సిజన్ సిలేన్దర్లను ఉచితంగా అందించేందుకు నడుం బిగించాడు. ఉచిత ఆక్సిజన్ సరఫరా పథకం చాలా మందికి లైఫ్‌సేవర్‌గా మారుతోంది. కరోనావైరస్ మహమ్మారి మధ్య ప్రాణాలను కాపాడుతూనే ఉన్న ఆక్సిజన్ సరఫరా పథకాన్ని ప్రారంభించడానికి షాహనావాజ్ షేక్ చాలా ఇబ్బందులు పడ్డాడు. గత ఏడాది తన ఎస్‌యూవీని ఆమ్మేశాడు దీనికోసం. దీంతో షాహనావాజ్ షేక్ మలాద్ లోని మాల్వానీ ఇరుకైన సందులలో హీరోగా మారిపోయాడు.

ముంబైలోని కోవిడ్ పరిస్థితి గురించి మాట్లాడుతూ “గత సంవత్సరం మేము ప్రారంభించినప్పుడు, మేము 5,000 నుండి 6,000 మందికి ఆక్సిజన్ అందించాము. ఈ సంవత్సరం, నగరంలో ఆక్సిజన్ కొరత ఉంది. ఇంతకు ముందు 50 కాల్స్ వచ్చేవి. ఇపుడు ఆ సంఖ్య 500 నుండి 600 వరకు ఉంటోంది” అని షేక్ చెప్పారు.

స్నేహితుడి బంధువు మరణంతో ఆలోచన!

కోవిడ్ మొదటి దశలో తన స్నేహితుడి బంధువు కోవిడ్ -19 తో మరణించారు. ఆసమయంలో అవసరమైన వారికి ఖర్చు లేకుండా ఆక్సిజన్‌ను సరఫరా చేయాలనే తన ప్రయత్నం ప్రారంభమైందని ఆయన అన్నారు. సకాలంలో ఆక్సిజన్ దొరికి ఉంటె ఆమె బ్రతికి ఉండేది అని తెలిసినపుడు ఈ ప్రయత్నం ప్రారంభించారు. దానికోసం కావలసిన ఆక్సిజన్ సిలిండర్లను కొనడానికి తన ఎస్‌యూవీని అమ్మేశాడు. సోషల్ మీడియాలో ఈయన చొరవ అతనికి చాలా ప్రశంసలు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. “మిస్టర్ షాహ్నావాజ్ షేక్ , అతని బృందం వంటి వ్యక్తులు నిజమైన హీరోలు” అని ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్ పోస్ట్ లో రాశారు.

“ఇంతకుముందు, నిధుల కొరత కారణంగా మేము సరిగ్గా పనిచేయలేకపోయాము. నా ఎస్‌యూవీ వంటి వాటిని మళ్లీ కొనుగోలు చేయవచ్చు. కానీ, ప్రస్తుతం ముఖ్యమైనది ఇతరులకు సహాయం చేయడమే” అని షేక్ చెప్పారు. “అందుకే నేను నా ఎస్‌యూవీని మరియు కొన్ని ఇతర వస్తువులను విక్రయించాను, ఆ విధంగా మేము ఇతరులకు సహాయం చేయగలిగాము.”

ఇదిలా ఉంటె.. గురువారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేసులను నమోదు చేసింది – 3.14 లక్షల కేసులు అలాగే, ఒక రోజులో 2,000 మరణాలు. COVID-19 పెరుగుతున్న కేసుల మధ్య దేశంలోని అనేక ప్రాంతాలు ఆక్సిజన్ కొరతను గురించి చెబుతున్నాయి.

Also Read: Corona Virus: మహారాష్ట్రలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. తెలంగాణ సరిహద్దు జిల్లాలపై తీవ్ర ప్రభావం

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డు పోగొట్టుకున్నారా..? ఒక్క ఎస్‌ఎంఎస్‌తో ఆధార్‌ నెంబర్‌ను లాక్‌ చేయవచ్చు… ఎలాగంటే..!