PM Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలంగాణను దోచుకున్నాయ్.. ప్రధాని మోదీ ఫైర్..

లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసింది.. ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. ఈ సారి 400ల సీట్లు లక్ష్యంగా పార్టీ కేడర్‌ను.. ఎన్డీఏ పార్టీలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశమంతటా వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన మోదీ.. వరుసగా పర్యటనలు చేస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 18, 2024 | 1:41 PM

లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసింది.. ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. ఈ సారి 400ల సీట్లు లక్ష్యంగా పార్టీ కేడర్‌ను.. ఎన్డీఏ పార్టీలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశమంతటా వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన మోదీ.. వరుసగా పర్యటనలు చేస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. తెలంగాణలో కూడా 17 కు 17 సీట్లు గెలవాలంటూ పార్టీ దిశానిర్దేశం చేసిన మోదీ.. వరుసగా పర్యటిస్తూ.. జోష్ నింపుతున్నారు. ఇవాళ తెలంగాణలో మరోసారి పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ.. జగిత్యాలలో నిర్వహిస్తున్న బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా సభలో పాల్గొని ప్రసంగించారు.

జగిత్యాల విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు తెలంగాణను దోచుకున్నాయని.. వారిని విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిందని విమర్శించారు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లోనూ కమీషన్లకోసం కక్కుర్తి పడ్డారని..వారిని ఎంతదూరం పెడితే అదే వారికి మెడిషిన్‌ అన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని ఏటీఎంలా వాడేస్తోందని ఫైరయ్యారు ప్రధాని మోదీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..