Prajagalam Public Meeting: చిలకలూరిపేట ప్రజాగళం సభకు భారీగా హాజరైన జనం
చిలకలూరిపేట బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రజా గళం సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఢిల్లీ నుంచి తొలుత గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి చిలకలూరిపేట సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మోదీకి చంద్రబాబు, పవన్ స్వాగతం పలికారు.
ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం అయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. చిలకలూరిపేట ప్రజాగళం సభలో ఈ ముగ్గురు అగ్ర నేతలు వేదిక పంచుకున్నారు. సభా వేదిక వద్దకు మోడీ చేసుకోగానే ఆ ప్రాంగణమంతా జై మోడీ.. జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్ నినాదంతో సభ దద్దరిల్లింది. పదేళ్ల తర్వాత ఏపీలో కూటమి తరపున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ, TDP, జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత ఇదే తొలి సభ. ఏపీలో 6 లోక్‌సభ స్థానాల్లో, 10 అసెంబ్లీ స్థానాల్లో BJP అభ్యర్థులు పోటీ చేస్తారు. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రాబోతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Mar 17, 2024 05:19 PM
వైరల్ వీడియోలు
Latest Videos