My India My Life Goals: ఈ భూమికి ప్రధాన శత్రువు ప్లాస్టికే.. రండి.. పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం..
Green Warriors - Kana Ram Mewada: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది.. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం.. ‘‘మై ఇండియా – మై లైఫ్ గోల్స్ పేరుతో.. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్’’ నినాదంతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
Green Warriors – Kana Ram Mewada: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది.. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం.. ‘‘మై ఇండియా – మై లైఫ్ గోల్స్ పేరుతో.. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్’’ నినాదంతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమంలో టీవీ9 నెట్‌వర్క్ కూడా భాగస్వామ్యమై.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న మహోన్నతమైన వ్యక్తులను గ్రీన్ వారియర్స్ పేరిట అందరికీ పరచయం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కానారాం మేవాడ.. టీ స్టాల్ యజమాని.. ఈయన కొన్నేళ్ల క్రితం పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించారు. చేసిన కృషితో ఆయన గ్రామంతోపాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిర్మూలన జరుగుతోంది. ప్రత్యేకించి ఆయన ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ సేకరణ చేస్తారు. అంతేకాకుండా కేజీ ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు ఇస్తారు. దీంతో ఆయన అందరికీ ఆదర్శంగా మారారు.
కానారాం మేవాడ ప్లాస్టిక్ నిర్మూలనపై ఏమన్నారంటే.. ‘‘అందరికీ నమస్కారం.. నాపేరు కానారాం మేవాడ.. నన్నందరూ కాన్ జీ చాయ్ వాలా అని పిలుస్తారు.. ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలోనూ.. ప్లాస్టిక్ కొండల్లా పేరుకుపోతోంది.. ప్రభుత్వం, మున్సిపాలిటీలు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ప్లాస్టిక్ నిర్మూలనకు తగిన పరిష్కారం దొరకడం లేదు.. నేను ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై దృష్టిపెట్టాను.. వాటర్ బాటిళ్లు, పాల ప్యాకెట్లు, చిప్స్ కవర్లు.. క్యారీ బ్యాగులు ఇలా వీటన్నింటినీ మేం ఇంటింటికీ వెళ్లి సేకరించడం మొదలుపెట్టాం.. అంతేకాకుండా ఇలా కేజీ ప్లాస్టిక్ వస్తువులు నాకిస్తే.. వారికి ఆకర్షణీయమైన వస్తువుల్నిస్తుంటాను.. వాళ్లు ప్లాస్టిక్ వ్యర్థాలను బయటపడేయకుండా.. నేను కూడా నావంతుగా ప్రయత్నిస్తున్నాను.. రండి..ఈ నా యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం..’’ అని పేర్కొన్నారు. ప్రతి నెలా తాను 200 కేజీలకుపైగానే ప్లాస్టిక్‌ను సేకరించడంతోపాటు.. రీసైక్లింగ్ చేస్తుంటారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..
