Watch: మరి కాసేపట్లో పెళ్లి.. గాల్లోకి వధువు కాల్పులు.. వీడియో వైర‌ల్.. ఆ తర్వాత ఏమైందంటే..?

Bride Firing in Air - Viral Video: దేశంలోని పలుచోట్ల శుభకార్యాలు నిర్వహించేటప్పుడు గాల్లోకి కాల్పులు జరుపుతున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి

Watch: మరి కాసేపట్లో పెళ్లి.. గాల్లోకి వధువు కాల్పులు.. వీడియో వైర‌ల్.. ఆ తర్వాత ఏమైందంటే..?
Bride Firing
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 01, 2021 | 3:37 PM

Bride Firing in Air – Viral Video: దేశంలోని పలుచోట్ల శుభకార్యాలు నిర్వహించేటప్పుడు గాల్లోకి కాల్పులు జరుపుతున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ పెళ్లి కూతురు గాల్లోకి కాల్పులు జ‌రిపి వార్త‌ల్లో నిలిచింది. అంతేకాదు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌తాప్‌ఘ‌ఢ్ జిల్లాలోని జెత్వారా ప్రాంతంలో చోటుచేసుకుంది. పెళ్లికూతురు రూపా పాండే త‌న వివాహ ముహుర్తానికి ముందు స్టేజ్ ఎక్కుతున్న వరుడు తుపాకీ ఇవ్వగా.. ఆమె గాల్లోకి కాల్పులు జ‌రిపింది. అనంతరం రామ్‌ నివాస్, రూపా పాండే వివాహం జరిగింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

మీరు కూడా వీడియో చూడండి..

ఇది కాస్తా పోలీసుల దాకా చేరడంతో.. అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రూపా పాండే కాల్పులు జ‌రిపిన రివాల్వ‌ర్ ఆమె మామ రామ్ నివాస్ పాండేది అని పోలీసులు గుర్తించారు. ఇది లైసెన్స్‌డ్ గన్ అని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు రూపా పాండేతో పాటు ఆమె మామ రామ్ నివాస్‌పై పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి సంఘటనలు బీహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో తరచూ జరుగుతుంటాయి. శుభకార్యాలు జరుపుతున్న క్రమంలో గాల్లోకి కాల్పులు జరుపుతుంటారు. ఈ క్రమంలో చాలామంది మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Also Read:

Ajith Bomb Threat: హీరో అజిత్ ఇంట్లో బాంబు.. స‌మాచారం అందుకున్న పోలీసులు త‌నిఖీలు చేయగా..

Private Hospitals: కొనసాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ.. కరోనాతో చనిపోయిన వ్యక్తికి రూ.18 లక్షల బిల్లు..!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో