Telangana: RDO ఆఫీసు పరిసరాల్లో ఒక్కసారిగా చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా..
ఆర్డీవో కార్యాలయం పరిసర ప్రాంతాల్లోని పొదల్లో ఒక్కసారిగా వడివడిగా చప్పుళ్లు వినిపించాయి. ఏంటో అర్థంకాక సిబ్బంది హైరానా పడ్డారు. ఆఫీస్ ఆవరణలో వెతుకుతూ ఉండగా చెట్ల పొదల్లో నుంచి రెండు పాములు సయ్యాట ఆడుతూ బయటకు వచ్చాయి. అవి సయ్యాట ఆడుతూ ఉండటంతో.. స్థానికులు వాటి జోలికి వెళ్లలేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ప్రభుత్వ భవనాల సమీపంలో రెండు పాములు పెనవేసుకుని స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. సయ్యాటలో ఉన్న వాటిని చూసి ఉలిక్కి పడ్డారు. చాలాసేపు అక్కడే అవి తమ నాట్యాన్ని కొనసాగించడంతో.. స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అవి జెర్రిపోతులు అని చెబుతున్నారు. అక్కడ ఆర్డీవో కార్యాలయంతో పాటు, ఫారెస్ట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ఉన్నాయి. వాటి చుట్టూ గుబురుగా పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగి చిట్టడవినీ తలపించేలా ఉంది. కొద్ది రోజులుగా ఆ ప్రాంతాన్ని క్లీన్ చేయడం లేదు. దీనితో పాములు, ఇతర క్రిమి కీటకాలు తిరుగుతూ ఉన్నాయని సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ప్రతి రోజూ ఆఫీస్ సిబ్బంది, ఉద్యోగులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు వస్తూ ఉంటారు.. ఏదయినా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ప్రభుత్వ కార్యాలయాల్లా లేవని..తక్షణమే అధికారులు స్పందించి ఆఫీస్ ఆవరణను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..