Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ముందుకు కేసీఆర్‌.. లైవ్ వీడియో

KCR: జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ముందుకు కేసీఆర్‌.. లైవ్ వీడియో

Shaik Madar Saheb

|

Updated on: Jun 11, 2025 | 11:07 AM

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కమిషన్ విచారించనుంది.. బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్కే) లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభంకానుంది. క్రాస్ ఎగ్జామిన్ లో కమిషన్ పలు కీలక వివరాలను అడిగి తెలుసుకోనుంది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటివరకూ.. అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు.. మాజీ మంత్రులను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించింది. అయితే.. ఇవాళ (బుధవారం) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కమిషన్ విచారించనుంది.. బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్కే) లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభంకానుంది. క్రాస్ ఎగ్జామిన్ లో కమిషన్ పలు కీలక వివరాలను అడిగి తెలుసుకోనుంది.  మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. అప్పటి నుంచి సుధీర్ఘ విచారణ జరుగుతోంది.

కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఫామ్‌హౌస్‌కు క్యూ కట్టారు. ఎమ్మెల్సీ కవితతోపాటు.. చాలా మంది బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ వెంట ర్యాలీగా బయలుదేరారు. కాగా.. BRK భవన్‌లోని కేసీఆర్‌తో పాటు 9 మందికి లోపలకు కమిషన్ అనుమతి ఇచ్చింది. కేసీఆర్ విచారణ నేపథ్యంలో BRK భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ రాక నేపథ్యంలో పార్టీ తరపున కేటీఆర్ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండి ఏర్పాట్ల పరిశీలించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో BRK భవన్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం భారీగా చేరుకుంటున్నారు.

Published on: Jun 11, 2025 10:02 AM