Viral news: భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. పైగా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్.. కారణమేంటంటే..
ఆలు మగలన్నాక చిన్న చిన్న అలకలు, గొడవలు సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో సిల్లీ విషయాలకే భార్యాభర్తలు విడిపోవడం, విడాకులు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని
ఆలు మగలన్నాక చిన్న చిన్న అలకలు, గొడవలు సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో సిల్లీ విషయాలకే భార్యాభర్తలు విడిపోవడం, విడాకులు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో అయితే ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకుని తీవ్రంగా గాయపరుచుకున్నఘటనలు కూడా బాగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఒక మహిళ తన భర్త వాకింగ్ కు వెళుతున్నాడన్న కోపంతో ఏకంగా అతనిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది. పైగా ఫ్రీ షిప్పింగ్ అంటూ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. విస్తుగొలిపే ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది.
పిల్లల్ని వదిలేసి వాకింగ్..
పూర్తి వివరాల్లోకి వెళితే.. మెక్‌అలిస్టర్, రోమింగ్ భార్యాభర్తలు. న్యూజిలాండ్ లో నివాసముంటున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల మెక్ తన భర్తను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టింది. అతని కోసం ప్రత్యేకంగా ఓ ప్రోఫైల్‌ని క్రియేట్ చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ సైట్లో ఉంచింది. దీనికి కారణమడిగితే.. ఆమె చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యపోయారు. తన భర్తకు వాకింగ్‌కి వెళ్లే అలవాటు ఉందని, అందుకోసం తనని, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడంటోంది. ఇక సెలవుల్లో కూడా పిల్లలను చూసుకోకుండా మధ్యలోనే వాకింగ్ కు వెళుతున్నాడంటోంది. తన భర్తతో గడపడమంటే తనకు చాలా ఇష్టమని, కానీ అతనేమో చెప్పా పెట్టకుండా వెళ్లిపోతాడని వాపోయింది. ఈ విషయంపై ఎన్నోసార్లు అతనితో మాట్లాడినా వినడం లేదని, అందుకే విసుగు వచ్చి ఈ పనిచేశానంటోంది.
ఆరడుగులుంటాడు.. నిజాయతీ పరుడు..
ఓ ఆన్ లైన్ ట్రేడింగ్ వెబ్ సైట్లో తన భర్తకు ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసిన మెక్ .. ‘యూజ్డ్ కండిషన్ ‘ అని ఒక ట్యాగ్ ని కూడా పెట్టింది. పైగా అందులో తన భర్త గుణగణాలను కూడా వివరించింది. ‘ నా భర్త ఆరు అడుగుల ఒక అంగుళం పొడవుంటాడు. వయసు 37 ఏళ్లు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకుంటాడు. ఎంతో నిజాయతీ పరుడు’ అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఎవరైనా తన భర్తను కొనుగోలు చేస్తే.. షిప్పింగ్ ఉచితమని ఆఫర్ ను కూడా ప్రకటించింది మెక్.
Also Read: IND VS SA: రెండో వన్డేలోనూ చతికిలపడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..