AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అక్కా.! మరీ ఇలా ఉన్నావేంటీ.. విడాకులకు మరేం రీజన్ దొరకలేదా.. వింటే గుండె ధడేల్

ఒకప్పుడు తమ మధ్య ఎన్ని గొడవలు జరిగినా.. భార్యాభర్తల బంధాన్ని తెగిపోకుండా చూసుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో వైవాహిక జీవితం చిన్నాభిన్నం అవుతోంది.

Viral: అక్కా.! మరీ ఇలా ఉన్నావేంటీ.. విడాకులకు మరేం రీజన్ దొరకలేదా.. వింటే గుండె ధడేల్
Viral News
Ravi Kiran
|

Updated on: Aug 03, 2024 | 12:11 AM

Share

ఒకప్పుడు తమ మధ్య ఎన్ని గొడవలు జరిగినా.. బంధాన్ని తెగిపోకుండా చూసుకునేవారు భార్యాభర్తలు. అయితే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో వైవాహిక జీవితం చిన్నాభిన్నం అవుతోంది. భర్త కుర్‌కురే తీసుకురాలేదని ఒకరు.. లిప్‌స్టిక్‌ తేలాదని ఇంకొకరు.. ఇలా చిత్రవిచిత్రమైన కారణాలతో విడాకులు తీసుకుంటున్న సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఈ తరహ ఘటనే ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో తెలిస్తే మీరూ షాక్ అవ్వడం ఖాయం.

తన భర్త పదేపదే మంచంపై మురికి బట్టలు తెచ్చి వేస్తున్నాడని విసిగిపోయిన ఓ భార్య ఏకంగా విడాకుల వరకు వెళ్లింది. తన భర్తకు ఉన్న ఈ ఒక్క అలవాటును తట్టుకోలేకపోతున్నానని.. విడాకులు ఇవ్వాలని ఆ మహిళ స్వయంగా కోర్టు మెట్లెక్కింది. మరి ఇంతకీ ఆమె భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకుందామా.. సదరు మహిళ భర్త ఓ చెఫ్. అతడు తన పని నుంచి ఇంటికి రాగానే.. మంచంపై ఫుడ్ స్టెయిన్స్, గ్రీజు మరకలతో నిండిన బట్టలను తెచ్చి విసిరేసేవాడట. ఇలా చేయడం వల్ల పదేపదే బెడ్‌షీట్స్ మార్చడమే ఆమెకు ఎడతెగని పనిలా మారింది. అంతేకాకుండా అతడ్ని ఈ చెడ్డ అలవాటును వదిలేయమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదట. దీంతో భర్త ప్రవర్తనకు విసిగిపోయిన భార్య చివరికి విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి