North Korea: వరద కష్టాల్లో కిమ్‌ రాజ్యం.. దక్షిణ కొరియా ఆఫర్‌..! కానీ,..

ఉత్తరకొరియాలో భారీ వరదలకు 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రాణ నష్టంపై కిమ్‌ సర్కారు ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని కిమ్‌ ఆదేశించారు.

North Korea: వరద కష్టాల్లో కిమ్‌ రాజ్యం.. దక్షిణ కొరియా ఆఫర్‌..! కానీ,..
North Korea
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 02, 2024 | 6:00 PM

నిత్యం యుద్దాలతో కవ్వింపులకు పాల్పడ్డే ఉత్తర కొరియా .. దక్షిణ కోరియా మధ్య వరదలతో మానవత్వం చిగురించింది. పీకల్లోతు వరదల్లో చిక్కుకున్న తమ దాయాది దేశానికి సాయం చేసేందుకు మానవత్వాన్ని చాటుకుంటూ ముందుకు వచ్చింది దక్షిణ కొరియా. భీకర వరదలతో అతలాకుతలమైన ఉత్తరకొరియాకు మానవతా సాయం అందిస్తామని ఆఫర్‌ చేసింది. బాధితులను ఆదుకునేందుకు సహాయ సామాగ్రిని అందజేస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. వాటిని ఎలా సరఫరా చేయాలన్న దానిపై చర్చించేందుకు తక్షణమే స్పందించాలని ఉత్తరకొరియా రెడ్‌ క్రాస్ సంస్థను కోరింది. అయితే, సియోల్‌ ఆఫర్‌పై కిమ్‌ సర్కారు స్పందించలేదు. 2019 నుంచి దక్షిణ కొరియాతో ఉత్తరకొరియా దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి సమయంలో కిమ్‌ రాజ్యానికి సాయం చేస్తామని దక్షిణ కొరియా ప్రకటించినప్పటికీ.. ఉత్తర కొరియా స్పందించలేదు.

అయితే ఉత్తరకొరియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులకు వరదలు రావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్వయంగా విపత్తు సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారు. రెస్క్యూ సిబ్బందితో పాటు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. ఉత్తరకొరియాలో భారీ వరదలకు 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రాణ నష్టంపై కిమ్‌ సర్కారు ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని కిమ్‌ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…