విషాదాన్ని మిగిల్చిన న్యూ ఇయర్ వేడుకలు.. బార్‌లో భారీ పేలుడు.. అనేక మంది మృతి
నూతన సంవత్సర వేడుకలు శోకసంద్రంగా మారాయి. స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్-మోంటానాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక బార్‌లో జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ తర్వాత ఈ పేలుడు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. అనేక మంది మరణించారు. ఇతరులు తీవ్రంగా గాయపడ్డారు.

నూతన సంవత్సర వేడుకలు శోకసంద్రంగా మారాయి. స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్-మోంటానాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక బార్‌లో జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ తర్వాత ఈ పేలుడు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. అనేక మంది మరణించారు. ఇతరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నివారణ బృందాలు భారీగా చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా క్రాన్స్-మోంటానాలోని ఒక బార్‌లోకి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వెంటనే మంటలు వ్యాపించి భయాందోళనలకు గురిచేశాయి. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
