Personality Test: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా
టెక్నాలజీ అభివృద్ధి చెందిన నాటి నుంచి ప్రతీ ఒక్కరి చేతుల్లోకి మొబైళ్లు వచ్చేశాయ్. అయితే మీకు ఎప్పుడైనా తెల్సా.! మీరు ఫోన్ పట్టుకునే విధంగా మీ స్వభావాన్ని చెప్పేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మీరు మీ ఫోన్‌ను ఎలా పట్టుకుంటారో..? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
టెక్నాలజీ అభివృద్ధి చెందిన నాటి నుంచి ప్రతీ ఒక్కరి చేతుల్లోకి మొబైళ్లు వచ్చేశాయ్. అయితే మీకు ఎప్పుడైనా తెల్సా.! మీరు ఫోన్ పట్టుకునే విధంగా మీ స్వభావాన్ని చెప్పేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మీరు మీ ఫోన్‌ను ఎలా పట్టుకుంటారో..? అది మీ ఇంటరెస్ట్‌లు, స్వభావం, ప్రవర్తన, బలాలు, బలహీనతలు చెబుతుంది. మరి మీరు అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ ఓసారి చూసేయండి..
ఇది చదవండి: పెదవుల ఆకారం మీ స్వభావం, వ్యక్తిత్వాన్ని చెబుతుందట.. ఎలాగో తెల్సా
– ఒక చేతితో ఫోన్ పట్టుకుని, అదే చేతి బొటన వేలుతో వాడటం..
ఇలా తన ఫోన్‌ను వాడేవారు ఆశావాదులు, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు. అస్సలు నిరక్ష్యపు ధోరణితో వ్యవహరించరు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను.. ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ధీటుగా ఎదుర్కుంటారు. మీ సామర్థ్యంపై ఎలప్పుడూ నమ్మకం ఉంచడమే కాకుండా, మీ మార్గంలో వచ్చే ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్తుంటారు. రిస్క్ తీసుకోవడానికి, అవసరమైనప్పుడల్లా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి సుముఖతతో ఉంటారు. తద్వారా మీ లక్ష్యాలను, ఆశయాలను సాధించుకుంటారు. అయితే అప్పుడప్పుడూ మీరు మీ లక్ష్యాలను చేధించే క్రమంలో కొన్నిసార్లు నిర్లక్ష్యంగా, చులకనగా వ్యవహరిస్తుంటారు. ఏ విషయంలోనూ లోతైన ప్రస్తావన చూడకుండా.. దూసుకుపోయే ధోరణి మీ సొంతం.
– ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకుని, ఒక చేతి బొటన వేలుతో వాడుతుంటే..
ఇలా మొబైల్‌ను వినియోగించేవారు.. తమ లక్ష్యాలను చేరే క్రమంలో ఎక్కువగా ప్రమాద నివారణలకు ప్రాధాన్యతను ఇస్తారు. తద్వారా తమ జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు సాగిస్తారు. సానుభూతిపరులు.. అలాగే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావాన్ని ఇట్టే అర్ధం చేసుకునే నైపుణ్యం మీ సొంతం. ప్రతీ విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు. తద్వారా మీ సంబంధాలు, పరిస్థితులపై పూర్తి స్పష్టత కలిగి ఉంటారు. మీరు మీ చర్యలు, జీవనశైలిలో నిర్దిష్ట సూత్రాలు పాటిస్తుంటారు. మీ డౌన్-టూ-ఎర్త్ స్వభావం వల్ల ఇతరులు మీ సహాయం కోరడం సర్వసాధారణం. మీ ప్రశాంతమైన స్వభావం.. ఇతరులకు ఓదార్పునిస్తుంది. సెకండ్ ఛాన్స్‌ల కోసం మీరూ ఎప్పుడూ ఎదురుచూడరు.
ఇది చదవండి: మీ అబ్బాయి ప్రేమలో పడ్డాడో.. లేదో..? తెలుసుకోండిలా.. ఈ లక్షణాలు కనిపిస్తే
– ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకోవడం, రెండు బొటనవేళ్లతో ఉపయోగించడం..
ఇలా తన ఫోన్‌ను వినియోగించేవారు ఫ్రీ బర్డ్స్, ఎలప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు. పరిస్థితులను త్వరగా విశ్లేషించి.. సమస్యకు త్వరగా పరిష్కారాన్ని రూపొందిస్తారు. ఇలా చేయడం వల్ల మీ సామర్థ్యం, మీ పదునైన బుర్ర ఏంటన్నది ఇతరులు ఈజీగా అర్ధం చేసుకుంటారు. మీరు మార్పుకు దూరంగా ఉండరు. బదులుగా, మీరు విభిన్నమైన నైపుణ్యాలతో ఏ చాలెంజ్‌నైనా ఈజీగా స్వీకరిస్తారు. అన్నింటా రాణిస్తుంటారు. ఎక్కువగా పార్టీలలో ఎంజాయ్ చేస్తారు. పిల్లలు చుట్టూ ఉన్నప్పుడు ఫ్రీ బర్డ్‌లా.. అలాగే ఆఫీస్ డిస్కషన్స్‌లో అత్యంత ఆలోచనాపరుడిగా ఉంటారు. మీరు ఎక్కువగా పోటీతత్వం, డిమాండ్ అధికంగా ఉన్న రంగాలపై ఆకర్షితులై ఉంటారు. లేదా ఇప్పటికే అందులో అభివృద్ధి చెందుతూ ఉంటారు. మీరు సాధించాలనుకునేవాటికి 24 గంటలు సరిపోవని అనుకుంటూ ఉంటారు.
– ఒక చేత్తో ఫోన్ పట్టుకొని మరొక చేతి చూపుడు వేలుతో వినియోగించడం..
ఇలా తమ ఫోన్‌ను వినియోగించేవారు.. అధిక మానసిక స్థైర్యాన్ని, పరిపక్వత స్థాయిని కలిగి ఉంటారు. అరుదైనా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ప్రతీసారి ఓ నిర్ణయం తీసుకునేముందు.. ఆప్షన్స్‌ను ఆచితూచి ఎంచుకుంటారు. మీరు ఇతరులకు సులభంగా లొంగరు. మీరు పొందిన జ్ఞానం ఎక్కువగా మీ స్వంత జీవిత అనుభవాల నుంచి వచ్చినది. ఇతరులు తడబడిన సవాళ్లను సైతం మీరు చాలా జాగ్రత్తగా ఎదుర్కుని విజయం సాధిస్తారు. మీ డిఫెరెంట్ మైండ్ సెట్, సరికొత్త ఆలోచనలు ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు చేపట్టే ఏ ప్రయత్నంలోనైనా మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎలప్పుడూ విజయం సాధించేలా చేస్తుంది. మీ మాటకారితనం, అలాగే మీ స్వభావం ఇతరులకు మీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి .
ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి