Viral: పొలంలో గుంతలు తవ్వుతుండగా తగిలిన ఏదో వస్తువు.. వెలికితీయగా కళ్లు జిగేల్

కేరళలోని కన్నూర్ జిల్లాలో పురాతన నిధి బయటపడింది. స్థానికంగా ఉన్న ఓ రబ్బర్ ప్లాంటేషన్ తోటలో వర్షపు నీటి కోసం గుంతలు తవ్విన కూలీలకు బంగారం, వెండి నాణేలు అలాగే ఆభరణాలతో కూడిన ఓ మట్టి కుండ దొరికింది.

Viral: పొలంలో గుంతలు తవ్వుతుండగా తగిలిన ఏదో వస్తువు.. వెలికితీయగా కళ్లు జిగేల్
Viral News
Follow us

|

Updated on: Jul 14, 2024 | 12:35 PM

కేరళలోని కన్నూర్ జిల్లాలో పురాతన నిధి బయటపడింది. స్థానికంగా ఉన్న ఓ రబ్బర్ ప్లాంటేషన్ తోటలో వర్షపు నీటి కోసం గుంతలు తవ్విన కూలీలకు బంగారం, వెండి నాణేలు అలాగే ఆభరణాలతో కూడిన ఓ మట్టి కుండ దొరికింది. చేమగై పంచాయతీ పరిధిలోని పరిప్పాయి ప్రభుత్వ ఎల్‌పీ పాఠశాల సమీపంలోని ఓ ప్రైవేట్‌ స్థలంలో ఈ విలువైన వస్తువులు లభ్యమయ్యాయి. ఇక పురావస్తు శాఖ ప్రాధమిక విచారణ ప్రకారం.. ఈ పురాతన వస్తువులు దాదాపు 200 ఏళ్ల నాటివని తేలింది.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ఇవి కూడా చదవండి

మొదటిగా ఆ మట్టి కుండను చూసిన కూలీలు.. అదేదో మందుపాతర అనుకుని భయపడ్డారు. అయితే తవ్వుతుండగా.. దానికి చిన్నగా పగులుడు ఏర్పడటంతో.. అందులో నుంచి విలువైన సంపద బయటపడింది. 17 ముత్యాల పూసలు, 13 బంగారు ఆభరణాలు, ఒక కశుమాల, ఒక జత చెవిపోగులు, వెండి నాణేలు ఆ కుండలో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే సమాచారాన్ని స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్‌కు అందించారు. అనంతరం పోలీసులకు కూడా విషయం తెలియడంతో వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఆ ప్రాంతంలో ఇంకా ఏమైనా పురాతన నిధులు ఉన్నాయేమోనని పురావస్తు శాఖ లోతైన దర్యాప్తు చేసేందుకు సిద్దమైంది. అయితే ఆ ప్రదేశానికి ఎలాంటి చారిత్రక ప్రాముఖ్యత లేకపోవడంతో.. వ్యక్తిగత సేకరణలో భాగంగా ఈ వస్తువులు ఎవరైనా మట్టిలో దాచి ఉండొచ్చునని పురావస్తు శాఖ అధికారి ఒకరు అంచనాకు వచ్చారు.

ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి