Telangana: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది
రోజూలాగే ఆ రూట్‌లో ముగ్గురు వ్యక్తులు రాత్రి తమ పని ముగించుకుని ఇంటికి బయల్దేరారు. అసలే రాత్రంతా జోరున వర్షం పడుతోంది. పైగా రోడ్డు పక్కనే నది ఉగ్రరూపం దాల్చిమరీ పోటెత్తుతోంది. సరిగ్గా మార్గం మధ్యలోకి వెళ్లేసరికి.. వారికి దూరం నుంచి చిమ్మ చీకట్లో నల్లటి ఆకారాలు కనిపించాయ్.
రోజూలాగే ఆ రూట్‌లో ముగ్గురు వ్యక్తులు రాత్రి తమ పని ముగించుకుని ఇంటికి బయల్దేరారు. అసలే రాత్రంతా జోరున వర్షం పడుతోంది. పైగా రోడ్డు పక్కనే నది ఉగ్రరూపం దాల్చిమరీ పోటెత్తుతోంది. సరిగ్గా మార్గం మధ్యలోకి వెళ్లేసరికి.. వారికి దూరం నుంచి చిమ్మ చీకట్లో నల్లటి ఆకారాలు కనిపించాయ్. అవి చూడడానికి భారీగా ఉన్నాయి. భయం.. భయంగా వెళ్లి చూస్తే దెబ్బకు పరుగో.. పరుగు అని అక్కడ నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకెళ్తే.. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో మొసళ్లు కలకలం రేపాయి. ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని చెరువు కట్ట సమీపాన గత రాత్రి మూడు భారీ సైజ్ మొసళ్లు గ్రామస్థులకు కనిపించాయి. దీంతో చెరువు కట్టపై ప్రయాణాలు సాగించేవారు జాగ్రత్తగా వెళ్లాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

