Trending News: మరో 9 రోజుల్లో పెళ్లి..ఇంతలోనే కాబోయే అల్లుడితో అత్త పరార్!
ప్రస్తుత సమాజంలో మానవసంబంధాలు ఎటు పోతున్నాయో అర్థంకావట్లేదు, సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో మనుషులు వావివరసలు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు కుటుంబాలు మధ్య పెళ్లి సంబంధం కుదిరింది. ఇంకో 9 రోజుల్లో పెళ్లి కావాల్సి ఉంది ఇంతలోనే రెండు కుటుంబాలకు పెద్ద షాక్ తగిలింది. కాబోయే అల్లుడితో పెళ్లికి ముందే వ్యవహారం నడిపిన అత్త..అతడితో పరారైంది. వివరాల్లోకి వెళ్తే..

Uttar Pradesh: అలీగఢ్ లోని మద్రాక్ పీఎస్ పరిధిలో జరిగిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ మహిల తన కూతురి కోసం ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. అబ్బాయి కూతురుకి నచ్చడంతో ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాయి. ఏప్రిల్ 16న పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. బంధువులు, స్నేహితులకు ఆహ్వానపత్రికలు కూడా ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్ల కోసం తరచూ అల్లుడు అత్తవారింటికి వచ్చే వాడట. అయితే ఈ క్రమంలో కాబోయే అల్లుడితో అత్త ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అబ్బాయికి కూడా ఆమె నచ్చడంతో ఇక ఇద్దరూ ప్రేమాయనం సాగించారు. మనోడు కాబోయే అత్త కోసం ఏకంగా కొత్త ఫోన్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడట. అయితే పెళ్లి జరిగితే విడిపోవాల్సి వస్తుందని.. కలిసి ఉండటం కుదరదని నిశ్చయించుకున్న ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్లాన్ వేశారు. కరెక్ట్‌గా పెళ్లికి ఇంకా తొమ్మిది రోజులు ఉందనంగా పెళ్లి కోసం చేయించిన నగలు, డబ్బు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయారు. షాపింగ్ కోసమని వెళ్లిన వారు తిరిగి రాకపోవడం, ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కూడా కనిపించకపోవడంతో ఇరు కుటుంబాలకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..