AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కస్టమర్లను ఆకర్షించేందుకు రెస్టారెంట్ వింత డిస్కౌంట్ ఛాలెంజ్.. ఎంత సన్నంగా ఉంటే అంత డిస్కౌంట్.. ఫన్నీ వీడియో

రెస్టారెంట్ కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల తాయిలాలను ఎరగా చూపిస్తారు. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. థాయిలాండ్‌లోని ఒక రెస్టారెంట్ దాని ప్రత్యేకమైన డిస్కౌంట్ సిస్టమ్ తో వైరల్ అవుతోంది. ఇక్కడ సన్నగా ఉన్న కస్టమర్లకు వారి ఆహార బిల్లులపై డిస్కౌంట్లను ఇస్తున్నారు. దీని కోసం ఒక మెటల్ గేట్ ఏర్పాటు చేయబడింది. ఇది కస్టమర్ల సన్నంగా ఉన్నారో లేదో తనిఖీ చేస్తుంది.

Viral Video: కస్టమర్లను ఆకర్షించేందుకు రెస్టారెంట్ వింత డిస్కౌంట్ ఛాలెంజ్.. ఎంత సన్నంగా ఉంటే అంత డిస్కౌంట్.. ఫన్నీ వీడియో
Viral Video
Surya Kala
|

Updated on: Apr 08, 2025 | 8:01 PM

Share

థాయిలాండ్‌లోని ఒక రెస్టారెంట్ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రకటించిన ఒక ప్రత్యేకమైన ఆఫర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు వారి సన్నగా ఉండటం ఆధారంగా వారు తిన్న బిల్లులపై డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇందులో అత్యంత సన్నగా ఉండే కస్టమర్ తిన్న ఆహార బిల్లులో 20 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. ఆ రెస్టారెంట్ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో కస్టమర్లకు వారి బరువును బట్టి వారి బిల్లుపై తగ్గింపు ఇస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో సన్నగా ఉండటాన్ని కొలవడానికి, రెస్టారెంట్ ఐదు భాగాలుగా విభజించబడిన మెటల్ రాడ్‌తో ఏర్పాటు చేసిన గేటుని చూడవచ్చు.

మెటల్ గేట్‌లోని ఒక భాగం మినహా.. మిగిలిన నాలుగు భాగాలలో సన్నగా ఉండడాన్ని బట్టి ఆహార బిల్లుపై 20%, 15%, 10%, 5% తగ్గింపులు ఇస్తున్నారు. అయితే ఐదవ భాగంలో.. క్షమించండి, మీరు మొత్తం బిల్లు చెల్లించాలి అని వ్రాసి ఉంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి కేవలం 5 శాతం తగ్గింపు పొందాడు. దీంతో నిరాశ చెందాడు.

ఇవి కూడా చదవండి

సన్నగా ఉంటే, డిస్కౌంట్ అంత ఎక్కువగా ఉంటుంది.. రెస్టారెంట్ ఈ ఆఫర్ చర్చలో ఉంది. ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

View this post on Instagram

A post shared by Amonthego (@amonthego15)

ఈ వీడియో @amonthego15 అనే ఖాతాలోని Instagramలో షేర్ చేశారు. యూజర్ క్యాప్షన్‌లో.. “ఇది ఏమీ లేకపోవడం కంటే మంచిది” అని రాశారు. అయితే.. మీరు ఎంత తగ్గింపు ఆశిస్తున్నారు? ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 58 వేలకు పైగా లైక్ చేశారు. కామెంట్ సెక్షన్ ఫన్నీ కామెంట్‌లతో నిండిపోయింది.

తక్కువ తినే వారికి ఎక్కువ తగ్గింపు లభిస్తుందని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. రెస్టారెంట్ యజమానులు తమ తెలివిని బాగా ఉపయోగించారు. మరొక యూజర్ మాట్లాడుతూ.. ఈ సోదరుడు డిస్కౌంట్ తీసుకున్న తర్వాతే అంగీకరిస్తాడని అన్నారు. ఈ ఆఫర్ జపనీస్, చైనీయుల కోసం మాత్రమే ప్రారంభించబడిందని మరొక వినియోగదారు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..