ఓరీ దేవుడో.. లీటర్ నీళ్లకు లక్షల రూపాయలా..? ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్స్..
మార్కెట్లో లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంతుంటుంది. మహా అయితే.. ఒక్క లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 ఉంటుంది. ఇంకా కాస్త పెద్ద కంపెనీ, కాస్ట్లీది తీసుకుంటే..కూడా వందకు మించదు. కానీ, లీటర్ వాటర్ బాటిల్ ధర లక్షల్లో ఉందంటే మీరు నమ్మగలరా? ఇది నిజం..కొంతమంది సెలబ్రెటీలు ఖరీదైన నీరు తాగుతారు. అవి తాగితే వారు యవ్వనంగా కనిపిస్తారు.. ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి కొన్ని ఖరీదైన వాటర్ బాటిల్స్, వాటి బ్రాండ్స్, ధరలు ఇక్కడ చూద్దాం..

ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటే..దాదాపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మంచినీళ్ల బాటిల్ వెంటపెట్టుకుని వెళ్తుంటారు. అలా కుదరకపోయినా, ఏదో హడావుడిలో మర్చిపోయినా కూడా అక్కడ అందుబాటులో ఉన్న దుకాణాల్లో కొనుకున్ని దాహం తీర్చుకుంటారు. మార్కెట్లో లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంతుంటుంది. మహా అయితే.. ఒక్క లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 ఉంటుంది. ఇంకా కాస్త పెద్ద కంపెనీ, కాస్ట్లీది తీసుకుంటే..కూడా వందకు మించదు. కానీ, లీటర్ వాటర్ బాటిల్ ధర లక్షల్లో ఉందంటే మీరు నమ్మగలరా? ఇది నిజం..కొంతమంది సెలబ్రెటీలు ఖరీదైన నీరు తాగుతారు. అవి తాగితే వారు యవ్వనంగా కనిపిస్తారు.. ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి కొన్ని ఖరీదైన వాటర్ బాటిల్స్, వాటి బ్రాండ్స్, ధరలు ఇక్కడ చూద్దాం..
ఫిలికో జ్యువెల్లరీ వాటర్ – లీటరుకు 5 లక్షల పైనే ఉంటుందట. జపాన్ నుంచి వచ్చే ఈ నీళ్లు స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో అలంకరించిన సీసాల్లో ఉంటాయి. ఇది స్టేటస్ సింబల్‌గా నిలుస్తుంది.
బ్లింగ్ H2O – లీటరుకు 3 లక్షలు.. ఈ అమెరికా వాటర్ బాటిల్ బ్రాండ్ స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో చేసిన సీసాలతో వస్తుంది. ఇది లగ్జరీ లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్‌గా నిలుస్తుంది.
అమెజాన్ – లీటరుకు 2.5 లక్షలు.. ఇది బ్రెజిల్‌లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి అందించే నీళ్ల బాటిల్.
నెవాస్ డెక్లార్ట్ – లీటరుకు రూ. లక్ష.. జర్మనీ నుంచి వచ్చే నెవాస్, మంచుగడ్డల ఫిల్టరేషన్ ద్వారా అసాధారణ స్వచ్ఛతను కలిగి నీళ్ల బాటిల్ ఇది.
ఎవియన్ వెర్జిన్ అబ్లోహ్ – లీటరుకు 17వేలకు పైనే ఉంటుందట. ఈ నీళ్లలో సహజ ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది స్టైలిష్ ప్యాకేజింగ్ కారణంగా బాగా ఫేమస్. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ కంపెనీకి చెందిన వాటర్ తాగుతారు.
స్వాల్‌బార్డి పోలార్ బ్లూ ఐస్ ఎడిషన్ – లీటరుకు 12వేలకు పైనే అంటున్నారు. ఆర్కిటిక్ మంచుకొండల నుంచి సేకరించిన ఈ నార్వేజియన్ నీళ్లు స్వచ్ఛమైన రుచిని అందిస్తాయి.
మైనస్ 181 – లీటరుకు 6 వేలకు పైనే ఉంటుంది. ఈ జర్మన్ బ్రాండ్ ప్రపంచంలోనే అత్యంత చల్లని నీళ్లని చెబుతోంది.
ROI – లీటరుకు 5వేలకు పైనే ధర పలుకుతుంది. ఈ నీళ్ల బాటిల్ లో యాక్టివ్ చార్‌కోల్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.
ఉయిస్‌గే సోర్స్ – లీటరుకు 5వేలకు పైనే ఉంటుందట. స్కాట్లాండ్ నుంచి వచ్చే ఈ నీళ్లు స్కాచ్ విస్కీకి కాంప్లిమెంట్‌గా ఉంటాయి.
బర్గ్ – లీటరుకు $31 విలువ. ఈ కెనడియన్ నీళ్లు ఒక మారుమూల గ్లేసియర్ నుంచి వస్తాయి. ఇది ప్రజలకు ఒక పాతకాలపు రుచిని ఇస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








