నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. కలోంజితో కలిగే లాభాలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
కలోంజీ సీడ్స్.. వీటిని ప్రత్యేకించి కొన్ని రకాల వంటకాలలో వాడుతుంటారు. దీంతో వంటలకు మంచి సువాసనతో పాటుగా, మంచి రుచి కూడా వస్తుంది. ఈ నల్లటి విత్తనాలలో విటమిన్లు, ఫైబర్, అమైనో యాసిడ్స్ ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కలోంజీ తీసుకుంటే చర్మ సమస్యలు పరిష్కారం అవడంతో పాటు థైరాయిడ్‌తో పోరాడే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కలోంజీ సీడ్స్ ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కలోంజి గింజలు జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కలోంజి గింజలను తింటే బ్లోటింగ్, గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి.. కలోంజి గింజలను వివిధ రూపాల్లో తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వీటిని తింటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. కలోంజి గింజల్ని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారు ఆరోగ్యం కోసం కలోంజి గింజలు తింటే మంచిది.
కలోంజి గింజల్లో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తింటే ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. కలోంజి గింజలు లివర్‌ను క్లీన్ చేయడానికి సహాయపడతాయి. కలోంజీ గింజలు కాలేయంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి కలోంజీ గింజలు మంచి ఎంపిక. కలోంజీ గింజలను వివిధ రూపాల్లో తీసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చు. కలోంజి గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
కలోంజి సీడ్స్ వాడకంతో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాదు.. కలోంజి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. కలోంజి గింజలను డైట్‌లో చేర్చుకుంటే మొటిమలు, వివిధ చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇవి కేవలం ఆరోగ్య పరంగానే కాదు.. అందానికి కూడా అద్భుతం పనిచేస్తాయి. కలోంజి గింజల నూనెను తలకు రాసుకుంటే కురులు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








