AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తప్పక తినాల్సిన ఆహారాలు..!

ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్‌ని LDL అంటారు. ఇది రక్తనాళాలలో అడ్డుపడి రక్తాన్ని గుండెకి చేరకుండా చేస్తుంది. దీని వల్లే గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యలొస్తాయి. అందువల్లే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే కొన్ని ఆహారాలను తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Bad Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తప్పక తినాల్సిన ఆహారాలు..!
Bad Cholesterol
Jyothi Gadda
|

Updated on: Apr 09, 2025 | 10:32 AM

Share

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే దాని పరిణామాలు మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై పడుతుంది. దీంతో బయట ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ శరీరంలోపల కొన్ని ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొలెస్ట్రాల్‌లో రెండు రకాలుగా ఉంటుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్‌ని LDL అంటారు. ఇది రక్తనాళాలలో అడ్డుపడి రక్తాన్ని గుండెకి చేరకుండా చేస్తుంది. దీని వల్లే గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యలొస్తాయి. అందువల్లే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే కొన్ని ఆహారాలను తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

బీన్స్:

బీన్స్‌లో ఫైబర్, మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించడంతో పాటు బరువు అదుపులో ఉంచుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ డైట్‌లో బీన్స్, చిక్కుళ్ళు, టోఫు వంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం కూడా మంచిది. దీని వల్ల ప్రోటీన్ బాడీకి అందుతుంది. ప్రోటీన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఓట్స్: ఓట్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఓట్ మీల్ తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ కరిగించుకోవచ్చు. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ని కరిగించి బయటికి పంపుతుంది. ఇందుకోసం పీచుపదార్థాలు తీసుకుంటే గుండెకి మంచిది. ఓట్స్‌ని చాలా రకాలుగా తీసుకోవచ్చు. మసాలా ఓట్స్, పాలతో కలిపి తీసుకోవచ్చు.

గింజలు: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా వంటి గింజల్లో ఫైబర్ మెండుగా ఉంటాయి. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు అదుపులో ఉంచుతాయి.

వంకాయ, బెండకాయ: వంకాయ, బెండకాయల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిలోని సాల్యుబుల్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

వెజిటేబుల్ ఆయిల్: చెడు కొలెస్ట్రాల్ కరగాలంటే పొద్దుతిరుగుడు, కనోలా, సఫోలా ఆయిల్ వాడటం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

సోయా: సోయా పాలు, సోయా బీన్స్, టోఫు వంటి సోయా ఉత్పత్తుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో దోహదపడుతాయి.

పండ్లు: యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లలో పెక్టిన్ ఉంటుంది. ఇది సాల్యుబుల్ ఫైబర్. ఇది చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కొవ్వు చేపలు: సాల్మోన్, మాకరెల్, ట్యూనా వంటి కొవ్వు చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడును చురుగ్గా మారుస్తాయి. సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీంతో పాటు ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి.

బార్లీ: బార్లీలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..