Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటి కాలిపై ఎంతసేపు నిలబడగలరో టెస్ట్‌ చేసుకోండి..? ఎన్ని లాభాలో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

మనిషి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి ఒంటికాలిపై నిలబడడం ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకటే కాలిపై బ్యాలెన్సింగ్​గా నిలబడడం అనేది శరీరంలోని అన్ని అవయవాల పనితీరుకు అద్దం పడుతుందని చెబుతున్నారు. ప్రతిరోజూ కాసేపు ఒంటి కాలిపై నిల్చోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

ఒంటి కాలిపై ఎంతసేపు నిలబడగలరో టెస్ట్‌ చేసుకోండి..? ఎన్ని లాభాలో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
Standing On One Leg
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 09, 2025 | 8:00 AM

వ్యాయామం చేసే సమయంలో కాసేపు ఒంటికాలిపై నిల్చోవడం అనేది సాధారణ వర్కౌట్‌. ఈ వర్కౌట్‌ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఇటీవల పరిశోధనలు వెల్లడించాయి. మనిషి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి ఒంటికాలిపై నిలబడడం ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకటే కాలిపై బ్యాలెన్సింగ్​గా నిలబడడం అనేది శరీరంలోని అన్ని అవయవాల పనితీరుకు అద్దం పడుతుందని చెబుతున్నారు. ప్రతిరోజూ కాసేపు ఒంటి కాలిపై నిల్చోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

ఒంటి కాలిపై కాసేపు నిల్చోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మొత్తం నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుందని చెబుతున్నారు. మైండ్‌-బాడీ బ్యాలెన్స్‌ అవుతాయి. ఒంటి కాలిపై నిల్చోవడం వల్ల ఉదర కండరాలు, తొడ కండరాలు దృఢంగా మారుతాయి. బాడీ మొత్తం దృఢంగా మారుతుంది. ఒంటి కాలిపై నిల్చోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.

క్రమం తప్పకుండా ఒంటి కాలిపై నిల్చునే వ్యాయామం చేస్తే కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీళ్ల దగ్గరి కండరాలు బలంగా మారుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఒంటికాలిపై నిల్చోవడం వల్ల శరీర భంగిమ బాగుంటుంది. వెన్నెముక నిటారుగా ఉంటుంది. వెన్ను సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఒంటికాలిపై నిల్చోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పెద్ద వయస్సు వారికి ఒంటికాలిపై నిల్చోవడం కష్టంగా ఉండొచ్చు. బ్యాలెన్స్‌ లేకపోతే కిందపడిపోయే ప్రమాదం ఉంది.  యోగాక్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఒంటికాలిపై నిల్చునే వ్యాయామాలు ఈజీగా చేయగలం. ఒంటికాలిపై నిల్చుని వ్యాయామం చేసే ముందు కండరాలను దృఢంగా మార్చుకోవడం అవసరం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..