ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యిని ఇలా తీసుకుంటే.. ఎంతటి రోగమైనా ఇట్టే మాయం..!
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీళ్లలో కొన్ని వస్తువులు కలిపి తీసుకుంటే..ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా చెక్ చెప్పవచ్చు అంటున్నారు. అంతేకాదు.. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే ఎంతటి రోగమైనా ఇట్టే మాయమౌతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆహారపు అలవాట్లు, జీవశైలి, కొన్ని రకాల చిట్కాలు పాటిస్తుంటే శరీరం ఎప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన రోజువారి అవాట్లతో మన శరీరాన్ని అన్ని రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చునని చెబుతున్నారు. అందులో భాగంగా మనం ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకునే ఆహారం కూడా అతి ముఖ్యమైనది. చాలా మందికి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది చాలా రకాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీళ్లలో కొన్ని వస్తువులు కలిపి తీసుకుంటే..ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా చెక్ చెప్పవచ్చు అంటున్నారు. అంతేకాదు.. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే ఎంతటి రోగమైనా ఇట్టే మాయమౌతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేడి నీటిలో నెయ్యి కలిపి ఖాళీ కడుపుతో తాగితే మలబద్ధకం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నెయ్యి కలిపిన వేడి నీళ్లు తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న నెయ్యి మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న నెయ్యి ఎముకల బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల వంటివి కూడా తగ్గుతాయి.
గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలిపి తీసుకోవటం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. కొలెస్ట్రాల్ బర్న్ అవుతుంది. దీంతో బరువు తగ్గుతారు. శరీరం ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. ఇవన్నీ కూడా మనలో రోగనిరోధక శక్తిని పెంచేవిగా పనిచేస్తాయి. కిడ్నీల ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల పేగులు పొడిబారడంతోపాటు జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీనివల్ల మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల కళ్లకు కూడా మేలు జరుగుతుంది. అంతేకాదు చర్మానికి కూడా చాలా మంచిది. నెయ్యి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..