AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క మారేడు దళం తింటే చాలు.. శరీరంలో జరిగే అద్భుతాలు..!

బిల్వదళం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క మారేడు దళం తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలు పొందుతారని అంటున్నారు. అసలు బిల్వదళంలో ఉండే పోషకాలేంటి? దీన్ని వేసవిలో రోజూ ఉదయమే తీసుకుంటే కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క మారేడు దళం తింటే చాలు.. శరీరంలో జరిగే అద్భుతాలు..!
Bael Leaves
Jyothi Gadda
|

Updated on: Apr 09, 2025 | 12:22 PM

Share

మారేడు ఆకులు వీటినే బిల్వ పత్రం కూడా అంటారు. ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ బిల్వపత్రం..చెంబునీళ్లు, ఒక్క మారేడు దళం సమర్పించినా చాలు.. ఆ పరమశివుడు ప్రసన్నం అవుతాడని భక్తుల విశ్వాసం. అయితే బిల్వదళం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క మారేడు దళం తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలు పొందుతారని అంటున్నారు. అసలు బిల్వదళంలో ఉండే పోషకాలేంటి? దీన్ని వేసవిలో రోజూ ఉదయమే తీసుకుంటే కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు నమలడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను కషాయం రూపంలో తీసుకున్న కూడా అద్భుత ఫలితాలినిస్తుందని చెబుతున్నారు. మారేడు ఆకులో కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు, విటమిన్లు A, C, B1, B6 పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ మారేడు ఆకు మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది. మారేడు ఆకులను తింటే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు.

బిల్వ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మారేడు ఆకులను తింటే బీపీ తగ్గుతుంది. గుండె సమస్యలు రావు. మారేడు ఆకులను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ ఆకుల్లో లభించే సమ్మేళనాలు షుగర్‌ను అదుపు చేస్తాయి. మారేడు ఆకులను నమలడం వల్ల కాలేయం ఆరోగ్యంగా మారుతుంది. కాలేయంలోని టాక్సిన్లను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఉదయాన్నే మారేడు ఆకులను నమలడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. శ్వాసకోస సమస్యలు తగ్గుతాయి. ఆస్తమా కంట్రోల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మారేడు ఆకుల్లో ఉండే ఎంజైమ్స్‌ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఈ ఆకులను నమలడం వల్ల మలబద్దకం, అజీర్తి నుంచి దూరంగా ఉండొచ్చు. మారేడు ఆకులను ఉదయాన్నే తినడం వల్ల శరీరంలోని మలినాలు అన్నీ బయిటకు పోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. బాడీ డీటాక్స్‌ అవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ