Mango Drink Recipes: మీరు మామిడి పండు ప్రియులా.. మామిడి పండ్లతో ఈజీగా డ్రింక్స్ చేసుకోండి.. రెసిపీ మీ కోసం..
వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రకరకాల మామిడి పండ్లను రుచి చుదడంలోనే నిజమైన ఆనందం దాగుందని మామిడి ప్రియులు చెబుతారు. అయితే వేసవిలో తాజాదనాన్ని అందించే అనేక రకాల రుచికరమైన పానీయాలు కూడా మామిడి పండ్లతో తయారు చేసుకోవచ్చు. ఈ రోజు మామిడి పండ్లతో తయారు చేసే సమ్మర్ డ్రింక్స్ రెసిపీల గురించి తెలుసుకుందాం..

పండ్లలో రారాజు అయిన మామిడి పండు రుచికి మాత్రమే కాదు.. అనేక విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. ఇందులో పొటాషియం, ప్రోటీన్, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పండిన మామిడి పండుని తినడం వలన జీర్ణక్రియను మెరుగుపరుడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. వివిధ పదార్థాలతో తయారు చేసిన మామిడి పండ్ల పానీయాలు మంచి రుచికరంగా ఉంటాయి. ఈ రోజు మనం మామిడి పండ్లతో తయారు చేసే సమ్మర్ డ్రింక్స్ రెసిపీల గురించి తెలుసుకుందాం..
మామిడిపండు అందరికీ ఇష్టమైనది. దీనితో అనేక రకాల డెజర్ట్‌లు, పానీయాలు కూడా తయారు చేస్తారు. మీరు కూడా మామిడిపండు ప్రియులు అయితే ఈ వేసవిలో మామిడి పండుతో చేసుకునే రుచికరమైన డ్రింక్స్ ను ట్రై చేయండి..
మ్యాంగో షేక్ తయారీ
వేసవిలో మామిడి రసం రుచి చూడకపోతే ఎలా.. ఈ రోజు మ్యాంగో షేక్ రెసిపీ తెలుసుకుందాం.. పండిన మామిడికాయ తొక్క తీసి.. ఒక పాత్రలోకి గుజ్జును తీయండి. ఈ మామిడి గుజ్జుని మిక్సిలో వేసి కొంచెం చక్కెర, పాలు కలపండి. బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమంలో కొంచెం ఐస్ వేసి మళ్ళీ బ్లెండర్ ని రెండు మూడు సార్లు గ్రైండ్ చేయండి. తర్వాత మామిడి పండు మిశ్రమాన్ని ఒక గ్లాసులో పోసి.. దానిపై డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి.
మామిడి-కొబ్బరి మోజిటో తయారీ
రిఫ్రెషింగ్ పానీయాల గురించి మాట్లాడుకుంటే.. మ్యాంగో మోజిటో తయారు చేసుకోవచ్చు. ముందుగా మామిడికాయ గుజ్జుని తీసి దానిలో నిమ్మరసం కలపండి. కొంచెం నల్ల ఉప్పు, చిటికెడు నల్ల మిరియాల పొడి జోడించండి. ఈ మిశ్రమానికి కొబ్బరి నీళ్లు జత చేసి ఐస్ వేసి ఆస్వాదించండి.
మామిడి లస్సీ
మామిడి లస్సీ రుచి అద్భుతంగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి మామిడికాయ గుజ్జును తీసి, పెరుగు, చక్కెరని కలపండి. దీని తరువాత కొంచెం యాలకుల పొడి వేసి.. తర్వాత తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి, ఐస్ క్యూబ్స్ వేసి లేదా ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తర్వాత సర్వ్ చేయండి.
మ్యాంగో మింట్ డ్రింక్
మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్ లో వేసి మామిడి ముక్కలకు పుదీనా ఆకులు, కొంచెం తేనెవేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గ్లాసులో నిమ్మకాయ ముక్కలు వేసి నల్ల ఉప్పు వేయండి. దాన్ని మాష్ చేయండి. గాజులో ఐస్ క్యూబ్ జోడించండి. ఇప్పుడు ఆ గ్లాస్ లో రెడీ చేసుకున్న మామిడి ప్యూరీని రెండు చెంచాలు లేదా రుచికి అనుగుణంగా వేసి ఒకసారి స్పూన్ తో మిక్స్ చేయండి. అంతే రుచికరమైన మామిడి పుదీనా పానీయం రెడీ.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..