AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ తనయుడికి గాయాలు.. రోజా ఏమని స్పందించారంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ అన్నాలెజినోవ దంపతుల చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ సింగపూర్‌లోని వ్యాలీ షాప్ హౌస్ లో చదువుతున్నాడు. ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం స్కూల్ భవనంలో రెండు, మూడు అంతస్తులలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ కు గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వార్త వెలువడిన వెంటనే పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి సహా సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.

Pawan Kalyan: పవన్ తనయుడికి గాయాలు.. రోజా ఏమని స్పందించారంటే..?
Pawan Kalyan Son Injured
Surya Kala
|

Updated on: Apr 08, 2025 | 5:49 PM

Share

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని, వ్యాలీ షాప్ హౌస్ లో ని స్కూల్ లో చదువుతున్నాడు. ఈ రోజు ఉదయం స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సమయంలో స్కూల్ లో 80 మంది పిల్లలు ఉన్నారు. అగ్ని మాపక సిబ్బంది అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించాడు. సుమారు 15 మంది పిల్లలు, నలుగురు పాటశాల సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పవన్‌ కల్యాణ్‌ తనయుడు మార్క్‌ శంకర్‌ కూడా ఉన్నాడు. శంకర్ చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది.

శంకర్ చదువుతున్న స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం వలన శంకర్ ఊపిరి తిత్తుల్లో పొగ చేరుకుందని.. వెంటనే శంకర్ ను హాస్పటల్ కి తరలింఛి చికిత్స అందించారని.. ఇప్పుడు శంకర్ బాగానే ఉన్నాడు అని చిరంజీవి తెలిపారు. శంకర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదని చిరంజీవి తెలిపారు. మరోవైపు ఏపీ మాజీ సిఎం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా పవన్ కళ్యాణ్ తనయుడు ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా .

ఇవి కూడా చదవండి

మార్క్‌ శంకర్‌కు జరిగిన ప్రమాదం గురించి విన్న వెంటనే తన మనసు ఎంతో కలత చెందిందని.. చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్‌ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్‌ చేశారు.

అయితే ప్రస్తుతం అరకు టూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్.. ఇక్కడ పర్యటన ముగించుకుని సింగపూర్ వెళ్లనున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు సింగపూర్ లో ఎందుకు ఉంటున్నాడు అని ఆలోచిస్తున్నారా.. పవన్ భార్య అన్నాలెజ్ నెవ సింగపూర్ లో చదువుకుంటున్నారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. చదువుకోసం వెళ్ళిన తల్లితో పాటు కుమారుడు కూడా అక్కడే చదువుకుంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..