- Telugu News Photo Gallery Spiritual photos Varanasi Travel Tips: these are the Best Summer Location For Travelers
Varanasi: వేసవిలో వారణాసికి వెళ్తున్నారా.. అధ్యత్మికతో పాటు ఈ ఉత్తమైన ప్రదేశాలను సందర్శించండి
వారణాసి భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని. ఇక్కడ పురాతన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఉత్సాహం, సాంస్కృతిక సంపద మూర్తీభవిస్తాయి. గంగా నది ఒడ్డున ఉన్న ప్రపంచంలోని అత్యంత పురాతన నగరమైన వారణాసి పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. మండుతున్న వేసవిలో ఎండలు ఉన్నప్పటికీ.. ఆ వేడిని తట్టుకునే ఏ ప్రయాణికుడికైనా వారణాసిని చూసి ఆనందించడానికి చాలా ఉంది. చరిత్ర, ఆచారాలతో పాటు ఆధ్యాత్మికతను కలిపే వేసవిలో వారణాసిలో సందర్శించగల కొన్ని ఉత్తమ ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Apr 08, 2025 | 5:08 PM

వారణాసి భారతదేశ సాంస్కృతిక వైభవం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడే పర్యాటకులకు.. ఆధ్యాత్మికత వాతావరణాన్ని ఇష్టపడే వారికి ఒక ఆసక్తికరమైన ప్రదేశంగా నిలుస్తుంది. ప్రశాంతమైన ఘాట్లు, పవిత్ర దేవాలయాల నుంచి సాంస్కృతిక హాట్‌స్పాట్‌లు, నదీ క్రూయిజ్‌లు, ఆధ్యాత్మికత, వారసత్వం, ఆకర్షణల పరిపూర్ణ మిశ్రమాన్ని అందించే స్థానిక మార్కెట్‌ల వరకు ఎన్నిటినో పర్యాటకుడు వారణాసిలో సందర్శించవచ్చు. ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయవచ్చు.

ఘాట్స్: వారణాసి ఒడ్డున ఉన్న ఘాట్‌లు నగరానికి ఆత్మ వంటివి. వేసవిలో నదీ తీరం వెంబడి మతపరమైన ఆచారాలు, వేడుకలు, దైనందిన జీవితానికి నిలయంగా మారుతుంది. ఈ ప్రదేశంలో జరిగే గంగా హారతి కారణంగా దశాశ్వమేధ ఘాట్ వద్ద సూర్యోదయ సూర్యాస్తమం ఉత్కంఠభరితంగా ఉంటాయి. యాత్రికులు నిర్వహించే ఆచారాలతో పాటు.. అక్కడ అందమైన దృశ్యాలను చూస్తూ ఈ నది వెంబడి పడవలో విహరించడం ఒక మధురానుభూతినిస్తుంది.

కాశీ విశ్వనాథ ఆలయం: శివుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి. తీవ్రమైన వేడి ఉన్నప్పటికీ.. భక్తులు ప్రతిరోజూ ఇక్కడకు వస్తారు. ఈ ఆలయ సముదాయం చేరుకునే మార్గం ఒక పద్మ వ్యూహం వంటిదిగా అనిపిస్తుంది. శివుడి ఆశీస్సులు పొందడానికి ఎండ, వానలు లెక్క చేయకుండా ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయానికి శివునికి సంబంధించిన పురాణాలు, ఇతిహాసాల గురించి మరింత తెలుసుకోవచ్చు.

సారనాథ్: వారణాసికి కొద్ది దూరంలో ఉన్న సారనాథ్ ఒక ప్రశాంతమైన స్వర్గధామం. ఇక్కడ వేసవి వేడి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ ప్రదేశంతో భౌద్ధ మతస్తులకు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎందుకంటే గౌతమ బుద్ధుడు తనకు జ్ఞానోదయం అయిన తర్వాత తన మొదటి ఉపన్యాసం ఇక్కడే ఇచ్చాడు. ధమేక్ స్థూపం, ములగంధ కుటి విహార్, ఇతర పురావస్తు శిధిలాలను సందర్శించడం ద్వారా మన దేశం ఆధ్యాత్మిక వారసత్వం గురించి తెలుసుకోండి. వారణాసిలో హడావిడి మధ్య, ప్రశాంతత, పచ్చదనంతో కూడిన సారనాథ్ లో సులభంగా ఊపిరి పీల్చుకునే ప్రదేశం.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా విద్యార్థులకు మేధోపరమైన, సాంస్కృతిక విందును అందిస్తుంది. విశాలమైన క్యాంపస్‌లోని భారత్ కళా భవన్ మ్యూజియంలో భారతదేశ కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే అనేక కళాఖండాలు, చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. సాంప్రదాయవాదం, ఆధునికత రెండింటినీ ప్రతిబింబించే విధంగా చక్కగా నిర్వహిస్తున్న తోటలు, అద్భుతమైన భవనాలతో ఇది నడవడానికి ఒక మంచి ప్రదేశం.

రామ్‌నగర్ కోట: రామనగర్ కోట పురాతన కాలం నాటి అంటే వారణాసి గత వైభవాన్ని ప్రతిబింబించే ఒక గంభీరమైన భవనం. 18వ శతాబ్దంలో బనారస్ మహారాజు నిర్మించిన ఈ అద్భుతమైన నిర్మాణం గొప్పతనాన్ని, నిర్మాణ ప్రతిభను ప్రదర్శిస్తుంది. ఇక్కడ హాళ్లు, పెద్ద ప్రాంగణాలు, కొన్ని మ్యూజియంలు ఉన్నాయి. ఇక్కడ రాజులు ఉపయోగించిన ఆయుధాలతో పాటు ఇతర రాజులకు చెందిన అవశేషాలతో పాటు పాతకాలపు కార్లను సందర్శించవచ్చు.

అస్సీ ఘాట్: అస్సీ ఘాట్ అనేది రత్నాల వంటి అసాధారణ గమ్యస్థానాలలో ఒకటి. ఇక్కడ వాతావరణంతో ప్రశాంతతతో పాటు.. ఆధ్యాత్మికతను వెదజల్లుతుంది. అయితే ఇప్పటికీ నగరంలోని ఇతర ప్రసిద్ధ ప్రదేశాలతో పోలిస్తే పర్యాటక ప్రాంతాల నుంచి కొంత దూరంలో ఉంది. అయితే ఈ ఘాట్ సాంస్కృతికంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నందున, కొన్ని ఇతిహాసాలకు సంబంధించిన మత విశ్వాసాల ప్రకారం.. ఈ ఘాట్ సాంస్కృతికంగా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అంతర్గత శాంతిని కోరుకుంటారు.

చునార్ కోట: గంగా నదిని చూస్తూ రాతి కొండ పైన ఉన్న చారిత్రాత్మక అద్భుతం చునార్ కోటను చూసేందుకు నగర సరిహద్దులను దాటి వెళ్లండి. దీనిని ఉజ్జయిని రాజు విక్రమాదిత్య నిర్మించాడు. శతాబ్దాల విజయాలు, యుద్ధాలు, కుట్రలకు సాక్ష్యంగా నిలిచింది. ఈ కోటలోని ప్రాకారాలు, నేలమాళిగలు, రహస్య మార్గాల నుంచి అది చాలా అద్భుతంగ ఉంటుంది. అదే సమయంలో నది, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.




