Shocking Video: కారులో ఇలా దర్జాగా కూర్చొని డ్రైవింగ్ చేసే అలవాటు మీకుందా? గగుర్పాటుకు గురిచేసే వీడియో
కొంత మంది కారు డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేస్తారు. కారులో లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తుంటారు. అయితే, డ్రైవింగ్ సమయంలో కొందరు కారు డ్యాష్‌బోర్డుపై కాళ్లు పెట్టి దర్జాగా కూర్చుంటారు. అలా కారులో ఒకరకమైన ఫీలింగ్‌ను ఆస్వాదిస్తుంటారు. అయితే, ఆ క్షణానికి అది థ్రిల్లింగ్‌ని ఇవ్వొచ్చు కానీ, పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే.. అలా కూర్చున్న వారికే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది.

కొంత మంది కారు డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేస్తారు. కారులో లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తుంటారు. అయితే, డ్రైవింగ్ సమయంలో కొందరు కారు డ్యాష్‌బోర్డుపై కాళ్లు పెట్టి దర్జాగా కూర్చుంటారు. అలా కారులో ఒకరకమైన ఫీలింగ్‌ను ఆస్వాదిస్తుంటారు. అయితే, ఆ క్షణానికి అది థ్రిల్లింగ్‌ని ఇవ్వొచ్చు కానీ, పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే.. అలా కూర్చున్న వారికే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అలా చాచిపెట్టిన కాళ్లు కాస్త ఎక్కడికక్కడ విరిగిపడి, మడతపడే ప్రమాదం ఉంది. అవును, కారు క్రాషింగ్ టెస్ట్‌లో ఇదే నిరూపితమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో కారు క్రాష్ టెస్ట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. క్రాష్ టెస్ట్‌లో భాగంగా కారు ముందు సీటులో మనిషి రూపంలో ఉన్న ఒక బొమ్మను కూర్చోబెట్టారు. ముందు సీటులో కూర్చున్న ఆ బొమ్మ కాళ్లు.. కారు డ్యాష్ బోర్డుపై పెట్టారు. సాధారణంగా కొందరు తమ కాళ్లను డ్యాష్ బోర్డుపై పెట్టి చేతులతో మొబైల్ ఫోన్లను ఆపరేట్ చేస్తుంటారు. అచ్చం అలాగే ఈ బొమ్మను కూడా సెట్ చేశారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ విధానంలో టెస్ట్ నిర్వహించి, క్రాస్ చేశారు. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడం ఈ క్రాష్ టెస్ట్‌లో చూడొచ్చు. కారు ముందు సీటులో కూర్చుని, డ్యాష్ బోర్డుపై కాళ్లు పెట్టుకుని కూర్చున్న వారి కాళ్లు ఇరిగిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.




ఈ కారు క్రాష్ టెస్ట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందుకే కారులో ప్రయాణించే ఎవరూ తమ కాళ్లను డ్యాష్ బోర్డుపై పెట్టుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. మీరూ ఓసారి వీడియోపై లుక్కేసుకోండి.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
This is what happens to a leg on the dashboard in a car accident. pic.twitter.com/3CofOGrqIO
— Interesting Videos (@moistonig) April 15, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..