AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: దరువేసిన హిట్‌మ్యాన్.. తబలాపై మాత్రం కాదండోయ్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరంతే..

MI Vs SRH: ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2023 సీజన్ అంతగా సాగడం లేదు. ఈ టీమ్ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో గెలిచి రెండింట్లో ఓడిపోయింది. ఈ జట్టు మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై తప్పక విజయం సాధించాలని కోరుకుంటోంది.

Watch Video: దరువేసిన హిట్‌మ్యాన్.. తబలాపై మాత్రం కాదండోయ్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరంతే..
Rohit Sharma Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Apr 18, 2023 | 5:32 PM

ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2023 సీజన్ అంతగా సాగడం లేదు. ఈ టీమ్ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో గెలిచి రెండింట్లో ఓడిపోయింది. ఈ జట్టు మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై తప్పక విజయం సాధించాలని కోరుకుంటోంది. ఓ వైపు మ్యాచ్ కోసం రంగం సిద్ధమవుతుంటే.. మరోవైపు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా కనిపించాడు.

ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఈ సమయంలో రోహిత్ చాలా జోవియల్ మూడ్‌లో కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోహిత్ చేసిన పని చూస్తే.. నవ్వుకోవాల్సిందే.

ఇవి కూడా చదవండి

తబలా వాయించిన రోహిత్..

ఈ వీడియో ముంబైకి చెందినదా లేదా హైదరాబాద్‌కి చెందినదా అనేది ధృవీకరించబడలేదు. అయితే వీడియో చూస్తుంటే ముంబై టీమ్ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లడం లేదా అక్కడి నుంచి వస్తున్నట్లు అనిపిస్తోంది. ముంబై ఆటగాళ్ల లగేజీని కొందరు హ్యాండిల్ చేస్తున్నారు. రోహిత్ కూడా అక్కడే ఉన్నాడు. రోహిత్ ఇంతలో తన సూట్‌కేస్‌ని హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి.. ఆ వ్యక్తి గుండుపై తబలా వాయించినట్లుగా తలపై వేళ్లతో దరువేశాడు. రోహిత్ షడన్‌గా ఇలా చేయడంతో.. ఆ వ్యక్తి తొలుత ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత సరదాగా నవ్వులు పూయించాడు.

హైదరాబాద్‌లో గెలవడం కష్టమే!

ఈ సీజన్ ముంబై కష్టాలు పడుతోంది. ఈ సీజన్‌లో విజయం కోసం చాలా కష్టపడుతోంది. ఐపీఎల్-2023లో తొలి సెంచరీ చేసిన హైదరాబాద్‌కు చెందిన హ్యారీ బ్రూక్ ముంబైకి సవాలుగా మారవచ్చు. వీరితో పాటు రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ కూడా ముంబైని కష్టాల్లోకి నెట్టవచ్చు. బౌలింగ్ విషయానికొస్తే, మార్కో జాన్సన్, ఉమ్రాన్ మాలిక్‌లతో ముంబై జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..