AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T10 Cricket: 2 ఓవర్లు.. 5 వికెట్లు.. నిప్పులు చెరిగే బంతులతో దడ పుట్టించిన బౌలర్.. ఎవరంటే?

European Cricket: ప్రస్తుతం టీ20 క్రికెట్‌ సందడితో అభిమానులకు మస్త్ మజా దొరుకుతోంది. భారత్‌లో ఐపీఎల్‌ సందడి నెలకొని ఉండగా, పాకిస్థాన్‌లో టీ20 సిరీస్‌ ముగిసింది. ఈ క్రమంలో ఓ బౌలర్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి సంచలనంగా మారాడు.

T10 Cricket: 2 ఓవర్లు.. 5 వికెట్లు.. నిప్పులు చెరిగే బంతులతో దడ పుట్టించిన బౌలర్.. ఎవరంటే?
Moufflons Vs Markhor
Venkata Chari
|

Updated on: Apr 18, 2023 | 5:03 PM

Share

ప్రస్తుతం టీ20 క్రికెట్‌ సందడితో అభిమానులకు మస్త్ మజా దొరుకుతోంది. భారత్‌లో ఐపీఎల్‌ సందడి నెలకొని ఉండగా, పాకిస్థాన్‌లో టీ20 సిరీస్‌ ముగిసింది. అదే సమయంలో, ఐరోపాలో టీ10 క్రికెట్ అభివృద్ధి చెందుతూనే ఉంది. అక్కడ పాకిస్తాన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న బౌలర్ ప్రత్యర్థి జట్టును అతలాకుతలం చేశాడు.

యూరోపియన్ క్రికెట్‌లో MOUFFLONS వర్సెస్ MARKHOR మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మఫ్లాన్స్ 10 ఓవర్లలో 7 వికెట్లకు 118 పరుగులు చేసింది. దీంతో మార్ఖోర్‌కు 119 పరుగుల లక్ష్యం ఉంది. అయితే మఫ్లాన్‌కు చెందిన పాకిస్థాన్ బౌలర్ వకార్ అలీ వారి ఛేదనను మరింత కష్టతరం చేశాడు.

5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన వకార్ అలీ ..

వకార్ అలీ 2 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో, అతని ఎకానమీ రేటు 2.5గా నిలిచింది. ఈ ఐదు వికెట్లలో 4 మఫ్లాన్ జట్టు మిడిల్ ఆర్డర్‌ ప్లేయర్స్‌వి కాగా, మరొకటి ఓపెనర్ ఒక వికెట్. బంతితో అతని అద్భుతమైన ప్రదర్శన మార్ఖోర్ జట్టులో ప్రకంపనలు సృష్టించింది.

ఇవి కూడా చదవండి

16 పరుగుల తేడాతో విజయం..

ఫలితంగా మార్ఖోర్ జట్టు 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వకార్ అలీ ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..